దేశీయంగా అభివృద్ధి చేసిన 'హైపర్సోనిక్ సాంకేతిక క్షిపణి వాహక నౌక' (హెచ్ఎస్టీడీవీ)ను విజయవతంగా ప్రయోగించినందుకు భారత రక్షణ పరిశోధన సంస్థ(డీఆర్‌డీఓ)ను ప్రశంసించారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రయోగం విజయం సాధించడం వల్ల.. ఈ సామర్థ్యం కలిగిన దేశాల సరసన భారత్ నిలిచిందని వెల్లడించారు.
"హైపర్సోనిక్ సాంకేతిక క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినందుకు డీఆర్డీఓకు అభినందనలు. మన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్క్రామ్‌జెట్ ఇంజిన్‌తో విమానం... ధ్వని కంటే 6 రెట్లు వేగంతో ప్రయాణించగలదు. ఇలాంటి సామర్థ్యం గల దేశాలు చాలా తక్కవగా ఉన్నాయి."