ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ అధ్యక్షుడిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యక్షులుగా విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, విదేశాంగ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీసంఘం ఛైర్మన్ పీపీ చౌదరీ, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్, సభ్య కార్యదర్శిగా ఐఎఫ్ఎస్ రిటైర్డ్ అధికారి టీసీఏ రాఘవన్ నియమితులయ్యారు.
వీరితో పాటు అయిదుగురు లోక్సభ, ముగ్గురు రాజ్యసభ సభ్యులకు దౌత్య, అంతర్జాతీయ వ్యవహారాల్లో అనుభవం ఉన్న ఏడుగురు ప్రముఖులు, ఏడు విశ్వవిద్యాలయాలకు చెందిన ఉపకులపతులు, ప్రొఫెసర్లకు ఇందులో స్థానం కల్పించారు. అదే విధంగా ఏడుగురు ప్రముఖ పాత్రికేయులు, వివిధ ప్రముఖ సంస్థలకు నేతృత్వం వహించిన వ్యక్తులు, ప్రముఖ వాణిజ్య సంస్థలకు నేతృత్వం వహిస్తున్న అదుగురు సభ్యులు, ముగ్గురు విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు, అయిదుగురు వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యదర్శులను సభ్యులుగా నియమించారు.