శరద్ పవార్ ఇంట్లో విపక్షాల భేటీ - Pawar's residence
సంయుక్త వ్యూహాలపై చర్చించేందుకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇంట్లో విపక్ష నేతలు సమావేశమయ్యారు.
"సీబీఐని దుర్వినియోగం చేస్తూ తమపై కేంద్రం దాడులు చేయిస్తోంది. వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగంతో యువతరం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రాజ్యాంగ సంస్థలను భాజపా నిర్వీర్యం చేస్తోంది. ఈ మూడు విషయాల్లో పూర్తి స్థాయి పరిష్కారం కోసం మళ్లీ కలుస్తాం. కోల్కతా విషయంలో మమతా బెనర్జీకి మద్దతు ఇవ్వాలనుకుంటున్నాం."
- శరద్ పవార్, ఎన్సీపీ అధినేత
సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కశ్మీర్ మాజీ సీఎం ఫారుఖ్ అబ్దుల్లా, తృణమూల్ నేత డెరెక్ ఒబ్రెయిన్ తదితరులు పాల్గొన్నారు.