తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డిమాండ్ల సాధనకు తరలిన వైద్య విద్యార్థి లోకం

బంగాల్​లో మొదలైన జూడాల నిరసన సెగ దేశవ్యాప్తమైంది. వైద్య విద్యార్థిపై దాడికి నిరసనగా వైద్యసంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. దేశంలోని ముఖ్య పట్టణాల్లో ర్యాలీ నిర్వహించారు వైద్య విద్యార్థులు.

By

Published : Jun 14, 2019, 5:30 PM IST

Updated : Jun 14, 2019, 7:57 PM IST

సమ్మె

డిమాండ్ల సాధనకు తరలిన వైద్య విద్యార్థి లోకం

బంగాల్​లో వైద్య విద్యార్థిపై దాడిని నిరసిస్తూ సహచరులు చేపట్టిన సమ్మెకు దేశవ్యాప్తంగా వైద్య సంఘాలు మద్దతు తెలిపాయి. దేశంలోని ముఖ్యపట్టణాల్లోని చాలా వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లో విధులను బహిష్కరించారు జూనియర్​ డాక్టర్లు. దిల్లీ ఎయిమ్స్​తో పాటు పలు చోట్ల వైద్య విద్యార్థులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.

బంగాల్​లో

విధుల్లో చేరాలని బంగాల్​ సీఎం మమతా బెనర్జీ హెచ్చరించినా వైద్యులు ఖాతరు చేయలేదు. నాలుగో రోజు సమ్మె కొనసాగించారు. ఫలితంగా వైద్యసేవలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

కోల్​కతాలోని ఎస్​ఎస్​కేఎం ఆసుపత్రిలో రోగి మృతికి కారణమయ్యారన్న ఆరోపణలతో ఇద్దరు వైద్యులపై దాడి జరిగిన కారణంగా జూడాలు సమ్మె చేస్తున్నారు. దాడికి కారణమైన వారిని అరెస్టు చేయాలని, అన్ని ఆస్పత్రుల వద్ద భద్రతను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

దిల్లీలో ఉద్ధృతంగా

దిల్లీ వైద్య సంఘం (డీఎంఏ) ఈ రోజు బంద్ నిర్వహించారు. దిల్లీ ఎయిమ్స్ వైద్యులు తలకు కట్టుతో నిరసన తెలిపారు. స్థానిక వైద్యుల సంఘం (ఆర్​డీఏ) సమ్మెతో ఓపీడీ వద్ద పేషెంట్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సఫ్దర్​జంగ్​ ఆసుపత్రి వైద్యులు విధులు బహిష్కరించి బంగాల్​ జూడాలకు మద్దతు పలికారు.

వైద్య సేవలకు అంతరాయం

మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బిహార్, ఛత్తీస్​గఢ్​లోనూ వైద్య విద్యార్థులు నిరసన బాట పట్టారు. ఫలితంగా రోగులు ఇబ్బంది పడ్డారు.

కేంద్రం జోక్యం

సమ్మె నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​.. వైద్య సంఘాలతో దిల్లీ భేటీ అయ్యారు. విధులకు హాజరు కావాల్సిందిగా అభ్యర్థించారు. బంగాల్​ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.

"వైద్యులు వేరే దారిలో నిరసన తెలిపితే బాగుంటుంది. సమ్మె ఎప్పుడూ సరైన నిరసనకు రూపం కాదు. అత్యవసర సేవల విషయంలో రోగులను విస్మరించలేం. అయినా వారు కేవలం భద్రతను కల్పించమన్నారు. అందుకు భిన్నంగా బంగాల్​ ప్రభుత్వం వైద్యులను హెచ్చరించటంవల్ల దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. సున్నితమైన విషయాలను పరువుతో ముడిపెట్టకూడదు. వైద్యులకు కావాల్సిన భద్రత కల్పిస్తాం.'

-హర్షవర్ధన్, కేంద్ర ఆరోగ్య మంత్రి

సమాధానమివ్వాలి: కలకత్తా కోర్టు

బంగాల్​లో వైద్యుల సమ్మెపై దాఖలైన వ్యాజ్యంపై వారం రోజుల్లోగా సమాధానమివ్వాలని ఆ రాష్ట్ర​ ప్రభుత్వాన్ని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. ఈ ఉద్రిక్తతలు తగ్గేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని సూచించింది. ఈ సమస్యకు పరిష్కారం వెతకాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొంది.

ఇదీ చూడండి: బంగాల్​ ఉద్రిక్తతల వెనుక హోంమంత్రి: మమత

Last Updated : Jun 14, 2019, 7:57 PM IST

ABOUT THE AUTHOR

...view details