తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వారణాసిలో శివ భక్తుల 'భస్మ హోలీ' - భస్మ హోలీ

ఉత్తర్​ప్రదేశ్ వారణాసిలోని పవిత్ర మణికర్ణిక ఘాట్​లో ఈ ఏకాదశి రోజున శివభక్తులు 'భస్మ హోలీ' వేడుకలు జరుపుకున్నారు. ఈ సమయంలో పరమశివుడు మణికర్ణిక ఘాట్​కు స్వయంగా వచ్చి భూత, ప్రేత, పిశాచాలు, అదృశ్య శక్తులతో కలిసి భస్మ హోలీ ఆడుతాడని భక్తులు విశ్వసిస్తారు.

Varanasi's 'Bhasma Holi' where Lord Shiva devotees play with ashes of the dead
వారణాశిలో శివ భక్తుల 'భస్మ హోలీ'

By

Published : Mar 7, 2020, 3:08 PM IST

వారణాసిలో శివ భక్తుల 'భస్మ హోలీ'

హోలీ.. కులాలు, మతాలు, వయస్సులకు అతీతంగా జరుపుకుంటారు. రంగులను జల్లుకుంటూ ఆనందంలో మునిగితేలుతుంటారు. అయితే ఉత్తర్​ప్రదేశ్ వారణాసిలో శివ భక్తులు వినూత్నంగా చితా భస్మంతో హోలీ జరుపుకుంటారు. పవిత్ర మణికర్ణిక ఘాట్​ (శ్మశానం) దగ్గర శివ భక్తులు ఈ 'భస్మ హోలీ' ప్రతి ఏటా నిర్వహిస్తుంటారు. అందులో భాగంగానే ఈ ఏకాదశి నాడు భస్మ హోలీని ఘనంగా చేసుకున్నారు.

సాధారణంగా ఏటా ఫాల్గుణ పూర్ణిమ నాడు హోలీ జరుపుకుంటారు. అయితే శివ భక్తులు మాత్రం మణికర్ణిక ఘాట్​లో ఏకాదశి రోజున చితా భస్మంతో భస్మ హోలీ జరుపుకుంటారు.ఈ సమయంలో పరమశివుడు మణికర్ణిక ఘాట్​కు స్వయంగా వచ్చి భూత, ప్రేత, పిశాచాలతో, అదృశ్య శక్తులతో కలిసి భస్మ హోలీ ఆడుతాడని శివభక్తులు విశ్వసిస్తారు.

వేడుక ఇలా జరిగింది..

ఈ వేడుకల్లో భాగంగా శివుడి పరమ భక్తులు, సాధు సన్యాసులు ఘాట్​ వద్దకు చేరుకున్నారు. తొలుత మహేశ్వరుడికి 'భంగ్​' (గంజాయి ధూమం) సమర్పించి పూజలు నిర్వహించారు. శ్మశానంలో మృతదేహాలను దహనం చేయగా.. మిగిలిన బూడిద (చితా భస్మం)ను ఒకరిపై ఒకరు జల్లుకుని భస్మ హోలీని జరుపుకున్నారు.

వేడుకల్లో 'ఖేలే మసానే మేన్ హోలీ దిగంబర్​', 'ఖేలే మసానే మేన్ హోలీ' అని జపిస్తూ.. శివుడి భక్తి పాటలతో నృత్యాలు చేశారు. భస్మ హోలీతో అక్కడి ప్రాంతమంతా బూడిదతో నిండిపోయింది.

ఇదీ చూడండి: విపత్కర పరిస్థితుల్లో ఆత్మరక్షణతోనే దేశరక్షణ!

ABOUT THE AUTHOR

...view details