జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుపెట్టనున్న నేపథ్యంలో కొవిషీల్డ్ టీకా పంపిణీ ప్రారంభం కానున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ నెల 11, 12 తేదీల్లో మహారాష్ట్ర పూణెలోని సీరం ఇన్స్టిట్యూట్ నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు టీకా రవాణా అవుతుందని వెల్లడించారు.
సీరం సంస్థ ఉన్న మంజారి ప్రాంతం నుంచి కట్టుదిట్టమైన పోలీసు భద్రతతో వ్యాక్సిన్‌తో నిండిన ట్రక్కులు బయలుదేరుతాయని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయడానికి మహా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.