జైళ్లు నేరస్థుల విలాసాలకు అడ్డాలుగా మారుతున్నాయన్న ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ కారాగరంలో ఓ ఘటన జరిగింది. ఇద్దరు ఖైదీలు జైల్లోనే తుపాకులు పట్టుకొని ఫోటోలకు పోజులివ్వడం, కారాగారంలోనే మద్యం సేవిస్తున్న దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ దృశ్యాలపై జిల్లా ఎస్పీ స్పందించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఇప్పటికే నివేదిక సమర్పించామన్న ఆయన.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.