తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇంత ప్రేమ నాకొద్దు బాబోయ్​.. విడాకులిప్పించండి ప్లీజ్​! - Divorce in India

భర్త తనపై ప్రేమ చూపించడం లేదని విడాకులు తీసుకునే వారిని చూసుంటాం. తరచూ గొడవ పడుతున్నాడని విడిపోవాలని అనుకుంటున్న వారి గురించీ వినే ఉంటాం. అయితే ఈ యూపీ మహిళ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. ఈమె విడాకుల కోసం చెప్పిన కారణం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

UP Woman Seeks Divorce for being too loved by Husband
మరీ ఇంత ప్రేమా? విడాకులు ఇప్పించండి ప్లీజ్​!

By

Published : Aug 22, 2020, 5:41 PM IST

తన భర్త తనపై నిత్యం ప్రేమ కురిపించాలని ఏ మహిళైనా కోరుకుంటుంది. అయితే ఈమె మాత్రం ప్రేమ మరీ ఎక్కువైందని తన భర్త నుంచి విడాకులు అడుగుతోంది. తనతో గొడవ పడట్లేదని విడిపోవాలని కోరుకుంటోంది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ మహిళకు 18 నెలల క్రితం వివాహమైంది. ఆ భర్త ఆమెను అపురూపంగా చూసుకుంటున్నాడు. ఆమెను సంతోషపెట్టేందుకు నిత్యం ప్రయత్నిస్తుంటాడు. అయితే ఇదే వారిద్దరి మధ్య అసలు సమస్యగా మారింది. తనపై చూపిస్తున్న అతి ప్రేమను తట్టుకోలేకపోతున్నానని ఆమె ఏకంగా విడాకులు కావాలని స్థానిక షరియా కోర్టును ఆశ్రయించింది.

'నాకు ఇంటి పనుల్లో సహాయపడతాడు. వంట చేసి పెడతాడు. ఏదైనా తప్పుచేస్తే వెంటనే క్షమిస్తాడు. నాపై ఎప్పుడూ కోప్పడడు. కానీ.. నాకూ అతడితో గొడవపడాలని ఉంటుందిగా. ఇంత ప్రేమను భరించలేను. ఇలాంటి వాతావరణంలో నేను ఇమడలేకపోతున్నా' అంటూ ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొంది.

కోర్టు తిరస్కరణ

అయితే ఆమె చెప్పిన కారణం విని ఆమె పిటిషన్‌ను కోర్టు గుమాస్తా తిరస్కరించారు. ఈ సమస్యను భార్యభర్తలే చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. దీంతో ఆమె స్థానిక పంచాయితీ పెద్దలనూ ఆశ్రయించింది. వారు కూడా అంత ప్రేమగా చూసుకునే భర్తతో ఎందుకు విడిపోతావని చెప్పి పంపించివేసినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:ఈ గణపతిని నిమజ్జనం చేయొద్దు.. కషాయం చేసుకోవాలి!

ABOUT THE AUTHOR

...view details