తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెళ్లయిన పాతికేళ్లకు 'నెట్​'లో అర్హత సాధించిన మహిళ - నెట్​ పరీక్ష

ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఓ మహిళ 50ఏళ్ల వయస్సులో యూజీసీ నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష(నెట్​)లో అర్హత సాధించారు. పెళ్లయిన పాతికేళ్లకు తన కల నెరవేరిందని తన అనుభవాలను 'ఈటీవీ భారత్​'తో పంచుకున్నారు. ఈ ఘనత సాధించే క్రమంలో తన భర్త, పిల్లలు అందించిన సహకారం మరువలేనిదని తెలిపారు.

up woman qualifies net after 25 years of marriage
పెళ్లయిన పాతికేళ్లకు 'నెట్​' పరీక్షలో అర్హత

By

Published : Dec 13, 2020, 2:16 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ లఖీమ్​పుర్​-ఖీరీ జిల్లాకు చెందిన అల్కాబాజ్​పేయీ కల 50 ఏళ్ల వయసులో నెరవేరింది. పెళ్లయిన పాతికేళ్లకు యూజీసీ నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష(నెట్)లో అర్హత సాధించి ఎంతో మందికి ఆమె స్ఫూరినిచ్చారు. మహిళాసాధికారతకు నిదర్శనంగా నిలిచారు.

" నేను గాంధీజీ సిద్ధాంతాలను నమ్ముతాను. వాటిపై ఎన్నో పుస్తకాలను చదివాను. ఆ బాటలోనే నెట్​ పరీక్షకు సన్నద్ధమయ్యాను. ఇద్దరు పిల్లలతో పరీక్షకు చదవటం కష్టంగా ఉండేది. 2009లో సైకాలజీలో పీజీ పూర్తి చేశాను. పిల్లలు పైచదువులకు వెళ్లడం వల్ల నేను మళ్లీ చదవడం ప్రారంభించాను. ఈ విజయంలో నా భర్త, పిల్లల సహకారం ఎంతో ఉంది."

--ఈటీవీ భారత్​తో అల్కా బాజ్​పేయీ.

పాతికేళ్లుగా ఒకటే లక్ష్యం

గతంలో రెండు సార్లు నెట్​ పరీక్ష రాసిన అల్కా..అర్హత సాధించలేదు. అప్పటినుంచి పరీక్ష కోసం పట్టుదలతో చదవటం ప్రారంభించారు. ఓ వైపు ఎం.ఏ చదువుతూనే పరీక్షకు సన్నద్ధమయ్యారు. ఆమెకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఒకరు పీహెచ్​డీ కోసం శిక్షణ పొందుతుండగా, మరొకరు ఇదివరకే యూజీసీ-నెట్​ పరీక్షలో విజయం సాధించారు.

ఇదీ చదవండి :పెంపుడు శునకాలకు 'ప్రత్యేక వసతి గృహం'

ABOUT THE AUTHOR

...view details