తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి ఆరోగ్యం విషమం! - UTTERPRADESH

ఉత్తర్​ప్రదేశ్​లోని ఉన్నావ్​ అత్యాచార ఘటన బాధితురాలు రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోగా.. బాధితురాలు, న్యాయవాదికి తీవ్రగాయాలయ్యాయి.

రోడ్డు ప్రమాదానికి గురైన కారు

By

Published : Jul 29, 2019, 6:58 AM IST

Updated : Jul 29, 2019, 7:25 AM IST

ప్రమాదానికి గురైన కారు

ఉన్నావ్​ అత్యాచార ఘటన బాధితురాలు ఉత్తరప్రదేశ్​లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఇదీ జరిగింది...

రాయ్​బరేలీ జైలులోని తమ బంధువును చూసేందుకు... ఆదివారం బాధితురాలు సహా ఆమె కుటుంబసభ్యులు, న్యాయవాది బయలుదేరారు. దారి మధ్యలో వారి వాహనాన్ని ఓ ట్రక్కు వేగంగా ఢీకొనడం వల్ల ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బాధితురాలి పిన్ని, మేనత్త అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు.

వెంటిలేటర్​పై చికిత్స...

ఆసుపత్రిలో క్షతగాత్రులను లఖ్​నవూ జోన్​ ఏడీజీ పరామర్శించారు. అనంతరం వారి పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్​పై చికిత్స పొందుతున్నారని ప్రకటించారు.

నిజానికి బాధితురాలితో పాటు భద్రతా సిబ్బంది ఉండాలని.. కారులో ఖాళీ లేకపోవడం వల్లే వారితో పాటు వెళ్లలేదని తెలిపారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.

దేశవ్యాప్తంగా ఉన్నావ్​ అత్యాచార ఘటన కలకలం రేపింది. ఈ కేసులో భాజపా ఎమ్మెల్యే కుల్​దీప్​ సెనగర్​ నిందితుడు. ఆయనను 2018 ఏప్రిల్‌ 13న అరెస్టు చేశారు. బాలికపై ఎమ్మెల్యే అత్యాచారం చేశాడంటూ ఆ చిన్నారి తల్లి ఫిర్యాదు చేసింది. సీఎం కార్యాలయం ఎదుట బాధితురాలు బలిదానానికి సిద్ధపడటం వల్ల ఈ కేసు సంచలనమైంది.

ఇదీ చూడండి: నేడు ముంబయిలో భారీ వర్షాలు- భయాందోళనలో ప్రజలు

Last Updated : Jul 29, 2019, 7:25 AM IST

ABOUT THE AUTHOR

...view details