తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'చౌకీదార్ భాజపా ఓటమిని తప్పించలేరు'

ఉత్తర్​ప్రదేశ్​ మహాకూటమి పార్టీలు అధికార పక్షంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. మోదీ సర్కార్​ విద్వేషపూరిత విధానాలు అనుసరించిందని ఆరోపించాయి. ఇప్పుడవే భాజపా ఓటమికి కారణం అవుతాయని జోస్యం చెప్పాయి. సార్వత్రిక ఎన్నికల కోసం తొలిసారి కలిసి ప్రచారం నిర్వహించాయి ఎస్పీ, బీఎస్పీ, ఆర్​ఎల్​డీ.

'చౌకీదార్ భాజపా ఓటమిని తప్పించలేరు'

By

Published : Apr 7, 2019, 3:55 PM IST

ఉత్తరప్రదేశ్ మహాకూటమి పార్టీలు ఎస్పీ, బీఎస్పీ, ఆర్​ఎల్​డీ మొదటిసారి సంయుక్తంగా ఎన్నికల ప్రచార సభ నిర్వహించాయి. సహారణ్​పుర్​ దేవ్​బంద్​ సభకు ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్​ యాదవ్​, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఆర్​ఎల్​డీ అధ్యక్షుడు అజిత్ సింగ్ హాజరయ్యారు. కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

సార్వత్రిక ఎన్నికల మొదటి దశ పోలింగ్​కు మూడు రోజుల ముందు భాజపా, కాంగ్రెస్​ల​పై విమర్శలతో విరుచుకుపడ్డారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. భాజపాను ఓటమి నుంచి 'చౌకీదార్' కూడా కాపాడలేరన్నారు. వారి విద్వేషపూరిత విధానాలను ప్రజలు తిరస్కరిస్తారని తెలిపారు. ఇందిరాగాంధీ హయాం నుంచి పేదరికాన్ని నిర్మూలిస్తామని చెబుతున్న కాంగ్రెస్ ఇప్పటి వరకు చేసిందేమీ లేదని ఆరోపించారు. యూపీలో రిగ్గింగ్ జరగకపోతే మహాకూటమిదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు మాయావతి.

గత ఎన్నికల్లో ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాల్లో రూ.15లక్షలు జమ చేస్తామన్న మోదీ, ఈ ఎన్నికల్లో అందరినీ చౌకీదార్లను చేశారని ఎద్దేవా చేశారు అఖిలేశ్​.

ఐదేళ్లుగా అధికారంలో ఉన్న ప్రధాని ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు ఆర్ఎల్​డీ అధినేత అజిత్ సింగ్​. 'అచ్చేదిన్'​లు మోదీకే పరిమితమయ్యాయి తప్ప ప్రజలకు మంచి రోజులు రాలేదని దుయ్యబట్టారు.

ఉత్తరప్రదేశ్​లో మహాకూటమి సభ

ఇదీ చూడండి: మోదీకి కుటుంబమంటే ఏంటో తెలీదు : పవార్​

ABOUT THE AUTHOR

...view details