తెలంగాణ

telangana

ETV Bharat / bharat

71గొర్రెలకు భార్యను ప్రియునికి అమ్మేసి మోసపోయాడు! - ఉత్తర్​ప్రదేశ్​

ప్రేమించిన వాడితో భార్యను పంపించాడు ఓ యువకుడు. అందుకు అతని వద్ద నుంచి 71 గొర్రెలను పరిహారంగా పొందాడు. ఇదంతా గ్రామ పెద్దల సమక్షంలోనే జరిగింది. ఈ వింత ట్రయాంగిల్​ లవ్ స్టోరీలో చివరకు ఆ భర్త బలిపశువయ్యాడు. ఉత్తర్​ప్రదేశ్​ గోరఖ్​పుర్​లో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

71గొర్రెలకు భార్యను ప్రియునికి అమ్మేసి మోసపోయాడు!

By

Published : Aug 19, 2019, 5:28 PM IST

Updated : Sep 27, 2019, 1:16 PM IST

71గొర్రెలకు భార్యను ప్రియునికి అమ్మేసి మోసపోయాడు!

ఉత్తర్​ప్రదేశ్​ గోరఖ్​పుర్​లో జరిగిన వింత సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ట్రయాంగిల్​ లవ్​స్టోరీలో భార్యను ప్రేమించిన వాడితో పంపించేందుకు అంగీకరించాడు రాజేశ్​ అనే వ్యక్తి. అందుకు పరిహారంగా 71 గొర్రెలను పొందాడు. చివరికి అతనిపై గొర్రెల దొంగతనం చేసిన కేసు నమోదయింది.

ఇదీ జరిగింది....

ఉత్తర్​ప్రదేశ్​ గోరఖ్​పుర్​కు చెందిన రాజేశ్​ గత జులై 22న తన భార్య.. ఉమశ్​ అనే వ్యక్తితో వెళ్లిపోయిందని పంచాయతీలో ఫిర్యాదు చేశాడు. అనంతరం ముగ్గురుని విచారించారు గ్రామ పెద్దలు. పంచాయతీలో వారు తమ ప్రేమను ఒప్పుకున్నారు. తన భర్తతో సంతోషంగా లేనని ప్రియురాలు తెలిపింది.

పరిశీలించిన పెద్దలు ఉమేశ్​కు రెండు అవకాశాలు ఇచ్చారు. వివాహేతర సంబంధాన్ని వదులుకోవాలి లేదా ప్రియురాలి భర్తకు గొర్రెల మందను ఇవ్వాలని తీర్పు వెలువరించారు. అతనికి జీవనాధారమైన గొర్రెలనే ఇచ్చేందుకు ఒప్పకున్నాడు ఉమేశ్​. రాజేశ్​కు 71 గొర్రెలను ఇచ్చాడు.

కొన్ని రోజుల తర్వాత ప్రియుడు ఉమేశ్​ తండ్రి పంచాయతీ నిర్ణయాన్ని తప్పుపట్టాడు. తన గొర్రెలను రాజేశ్​ దొంగలించాడని ఆరోపించాడు. గొర్రెలను ఇప్పించాలని పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజేశ్​ను అరెస్ట్​ చేసి... అతని వద్ద నుంచి 71 గొర్రెలను స్వాధీనం చేసుకున్నారు.

" ఉమేశ్​ తండ్రి తన గొర్రెలు పోయినట్లు ఫిర్యాదు చేశాడు. సాక్ష్యాధారాలు పరిశీలించిన అనంతరం నిందితుడి నుంచి గొర్రెలను స్వాధీనం చేసుకుని అతని తండ్రికి అప్పగించాం. మహిళ ప్రియుడితో వెళ్లిన విషయంలో మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ప్రస్తుతం వివాహం, సహజీవనం సంబంధాల్లో పోలీసులు జోక్యం చేసుకోవటానకి వీలు లేదు. మహిళగాని, పురుషుడు గాని ఫిర్యాదు చేస్తే పరిశీలిస్తాం."

-డా.సునీల్​ గుప్తా, ఎస్పీ

ఇదీ చూడండి: 'కశ్మీర్​లో మానవ హక్కుల ఉల్లంఘన'

Last Updated : Sep 27, 2019, 1:16 PM IST

ABOUT THE AUTHOR

...view details