యూపీలో సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార బాధితురాలి మేనల్లుడు(8) రెండురోజలుగా కనిపించడం లేదని.. కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అత్యాచారానికి పాల్పడ్డ నిందితుల కుటుంబీకులే అపహరించారని వారు ఆరోపించారు.
ఉన్నావ్ అత్యాచార బాధితురాలి బంధువు కిడ్నాప్! - Unnao incident updates
యూపీ ఉన్నావ్ అత్యాచార బాధితురాలి బంధువు అపహరణకు గురయ్యారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు అత్యాచారానికి పాల్పడ్డ నిందితుల కుటుంబంపై అనుమానం వ్యక్తం చేస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఉన్నావ్ అత్యాచార బాధితురాలి బంధువు కిడ్నాప్!
ఈ నేపథ్యంలో ఉన్నావ్ ఎస్పీ, ఏఎస్పీలు బాధితుల గ్రామానికి చేరుకుని.. ఆ కుటుంబసభ్యుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఫిర్యాదులో ఐదుగురి(ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు)పై అనుమానం వ్యక్తం చేయగా.. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తప్పిపోయిన బాలుడిని వెతికేందుకు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు పోలీసులు.
ఇదీ చదవండి:'మహిళలపై అత్యాచారాలు.. జాతికే అవమానం'