తెలంగాణ

telangana

By

Published : Dec 7, 2019, 11:45 AM IST

Updated : Dec 7, 2019, 2:14 PM IST

ETV Bharat / bharat

'ఉన్నావ్​ బాధితురాలి కుటుంబానికి సరైన న్యాయం చేస్తాం'

ఉన్నావ్​ అత్యాచార బాధితురాలి మరణంపై యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్​ విచారం వ్యక్తం చేశారు. ఫాస్ట్​ట్రాక్​ కోర్టులో విచారణ జరిపించి, దోషులకు శిక్షపడేలా చూస్తామని హామీ ఇచ్చారు.

Unnao rape case will be fast tracked: Adityanath
'ఉన్నావ్​ బాధితురాలి కుటుంబానికి సరైన న్యాయం చేస్తాం'

'ఉన్నావ్​ బాధితురాలి కుటుంబానికి సరైన న్యాయం చేస్తాం'

ఉన్నావ్ అత్యాచార బాధితురాలి మృతిపై ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబానికి సంతాపం తెలియజేశారు.

"నిందితులందరినీ పోలీసులు అరెస్టు చేశారు. కేసుపై ఫాస్ట్​ ట్రాక్​ కోర్టులో విచారణ జరుగుతుంది. తప్పుచేసిన వారికి కచ్చితంగా శిక్ష పడుతుంది." - యోగీ ఆదిత్యనాథ్, ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి

న్యాయం చేయండి..

23 ఏళ్ల ఉన్నావ్​ బాధితురాలి మరణం చాలా బాధాకరమని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. వారి కుటుంబానికి బీఎస్పీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. బాధితురాలి కుటుంబానికి తగిన న్యాయం జరిగేలా చూడాలని ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వాన్ని మాయావతి కోరారు.

దేశవ్యాప్తంగా ఇలాంటి బాధాకరమైన ఘటనలు జరగకుండా నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకురావాలని ఆమె కోరారు. వీలైనంత త్వరగా దోషులకు ఉరిశిక్ష పడేలా చూడాలని అభిప్రాయపడ్డారు.

గతేడాది ఇద్దరు వ్యక్తులు ఉన్నావ్​ బాధితురాలిపై అత్యాచారం చేశారు. అయితే కేసు విచారణ కోసం కోర్టుకు వెళ్తున్న ఆమెకు ఐదుగురు వ్యక్తులు నిప్పంటించారు. మెరుగైన చికిత్స కోసం వెంటనే ఆమెను విమానంలో దిల్లీలోని సఫ్దర్​జంగ్ ఆసుపత్రికి అధికారులు తరలించారు. అయితే 90 శాతం కాలిన గాయాలతో శుక్రవారం రాత్రి ఆమె మరణించింది.

ఇదీ చూడండి:అమ్మాయిల్ని అల్లరి చేసినందుకు యువకుడికి దేహశుద్ధి!

Last Updated : Dec 7, 2019, 2:14 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details