తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉన్నావ్​ నిందితుడిపై సీబీఐ ప్రశ్నల వర్షం

ఉన్నావ్​ కేసుల నిందితుడు సెంగార్​ను అనేక గంటలపాటు విచారించింది కేంద్ర దర్యాప్తు సంస్థ. అత్యాచార బాధితురాలి స్వగ్రామం ఉన్నావ్​ను మరొక బృందం సందర్శించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేసుల విచారణలో వేగం పెంచింది సీబీఐ.

ఉన్నావ్​ నిందితుడిపై సీబీఐ ప్రశ్నల వర్షం

By

Published : Aug 4, 2019, 9:13 AM IST

భాజపా బహిష్కృత ఎమ్మెల్యే, ఉన్నావ్​ కేసుల నిందితుడు కుల్​దీప్​ సెంగార్​ను సీతాపూర్​ జైలులో కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) విచారించింది. ముగ్గురు సభ్యుల బృందం సెంగార్​పై అనేక గంటలపాటు ప్రశ్నల వర్షం కురిపించింది.

ఉన్నావ్​ కేసుల్లో దర్యాప్తు ముగించడానికి సుప్రీం కోర్టు సీబీఐకి 2 వారాల గడువిచ్చింది. ఈ నేపథ్యంలో దర్యాప్తును వేగవంతం చేయడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది కేంద్ర దర్యాప్తు సంస్థ.

బాధితురాలి స్వగ్రామమైన ఉన్నావ్​ను నలుగురు సభ్యుల సీబీఐ బృందం శనివారం సందర్శించింది. దర్యాప్తు ముగించిన అనంతరం లఖ్​నవూకు తిరిగి పయనమైంది. సీబీఐ సందర్శించిన సమయంలో బాధితురాలి కుటుంబ సభ్యులెవరూ గ్రామంలో లేరని స్థానిక పోలీసులు తెలిపారు.

అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు రాయ్​బరేలీ జైలులో ఉన్న బాధితురాలి మేనమామ మహేశ్​​ను దిల్లీలోని తిహార్​ కారాగారానికి శుక్రవారం తరలించారు అధికారులు. అంతకుముందు అతడిని సీబీఐ బృందం విచారించింది. ఎన్నో ఏళ్ల ముందు సెంగార్​ తమ్ముడిపై దాడికి సంబంధించిన కేసులో మహేశ్​ జైలులో ఉన్నారు.

రోడ్డు ప్రమాదంపై...

జులై 28న రాయ్​బరేలీ జైలులోని తన బంధువును చూడటానికి వెళ్తూ అత్యాచార బాధితురాలి కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఘటనాస్థలాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ మరోసారి సందర్శించింది. కారును ఢీకొన్న లారీని పరిశీలించింది. లారీ డ్రైవర్​, క్లీనర్​ను ప్రశ్నించింది.

ఈ ఘటనలో అత్యాచార బాధితురాలు తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం అమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇదే రోడ్డు ప్రమాదంలో బాధితురాలి బంధువులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి:'ఉన్నావ్'​ కేసులో పోలీసులకు లంచాలు..!

ABOUT THE AUTHOR

...view details