తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కాంగ్రెస్​కు సరైన సంస్థాగత వ్యవస్థ లేదు'

కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ గాంధీ తప్పుకోవడంపై భాజపా నేతలు స్పందిస్తున్నారు. కాంగ్రెస్​కు సంస్థాగత నిర్మాణం లేదని కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ వ్యాఖ్యానించారు. భాజపా ప్రజాస్వామ్యయుత పార్టీ అని, కాంగ్రెస్​ది కుటుంబ పాలనని అన్నారు ఆ పార్టీ అధికార ప్రతినిధి నళిన్ కోహ్లి.

'కాంగ్రెస్​కు సరైన ఎన్నికల వ్యవస్థ లేదు'

By

Published : Jul 3, 2019, 7:36 PM IST

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామాపై అధికార భాజపా నేతలు స్పందించారు. తమ పార్టీకి ఇప్పటికే సంస్థాగత నిర్మాణం, కార్యాచరణ ఉందన్నారు కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్. కానీ కాంగ్రెస్​కు అది కొరవడిందన్నారు.

"భాజపాలో సంస్థాగత ఎన్నికలు, సభ్యత్వ నమోదుపై మాకు కాలమానిని ఉంది. మాకు కార్యనిర్వాహక అధ్యక్షుడూ ఉన్నారు. కాంగ్రెస్​లో ఆ వ్యవస్థ లేకపోతే మేమేం చేయగలం."-ప్రకాశ్ జావడేకర్

రాహుల్ రాజీనామాపై స్పందించారు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ. నూతన నాటకానికి తెర లేచిందన్నారు. రాహుల్ రాజీనామాపై స్పందించారు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్. అధ్యక్ష నిర్ణయం పట్ల కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు.

తమది ప్రజాస్వామ్యయుతమైన పార్టీ అని, కాంగ్రెస్​ పార్టీది కుటుంబ పార్టీ అని వ్యాఖ్యానించారు భాజపా జాతీయ అధికార ప్రతినిధి నళిన్ కోహ్లి. తమ పార్టీలో సామాన్యుడూ అత్యున్నత పదవులు చేరుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు.

"దేశంలో రెండు రకాల రాజకీయ పార్టీలున్నాయి. భారతీయ జనతా పార్టీలా ప్రజాస్వామ్యయుతంగా కొనసాగుతుంటాయి. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వారు భాజపా అధ్యక్షుడు అమిత్​షాలా అత్యున్నత పదవుల్లోకి రావచ్చు . నరేంద్రమోదీలా ప్రధానమంత్రి కావచ్చు. రెండో రకమైన పార్టీలు కాంగ్రెస్ పార్టీలా కుటుంబ ఆధారిత పార్టీలు. నెహ్రూ-గాంధీ కుటుంబం నుంచైనా ఆ పార్టీ అధ్యక్షులు ఉంటారు.. లేదా ఆ కుటుంబం మద్దతుతో అధ్యక్షులవుతారు. నెహ్రూ-గాంధీ కుటుంబం నుంచి అధ్యక్ష పదవి చేపడతారా లేదా అనేది వారే నిర్ణయించుకోవాలి."

-నళిన్ కోహ్లి, భాజపా నేత

రాహుల్ రాజీనామాపై భాజపా అధికార ప్రతినిధి నళిన్ కోహ్లి

ఇదీ చూడండి: రాహుల్​ నిష్క్రమణ... కాంగ్రెస్​కు కొత్త అధ్యక్షుడు!

ABOUT THE AUTHOR

...view details