ఉగ్రవాద కార్యకలాపాల నియంత్రణ చట్టం సవరణ బిల్లు- 2019కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సుదీర్ఘంగా సాగిన చర్చ అనంతరం జరిగిన ఓటింగ్లో 147- 42 తేడాతో బిల్లుకు సభ్యులు ఆమోదముద్ర వేశారు. జులై 24న లోక్సభలో బిల్లుకు ఆమోదం లభించింది.
ప్రభుత్వ వ్యవస్థలను ఉగ్రవాదుల కంటే నాలుగు అడుగులు ముందు నిలిపే లక్ష్యంతోనే సవరణలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రతిపాదిత నూతన చట్టం ఏవిధంగానూ దుర్వినియోగం కాదని తేల్చిచెప్పారు. యూపీఏ హయాంలో ఉగ్రవాద వ్యతిరేక చట్టానికి సరైన విధంగా సవరణలు చేస్తే ఇప్పుడు చేయాల్సి వచ్చేది కాదన్నారు షా. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చట్టాలు చేయాల్సి ఉంటుందన్నారు