కేంద్ర న్యాయశాఖ మంత్రిగా రవిశంకర్ ప్రసాద్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా స్మృతి ఇరానీ పదవీ బాధ్యతలు చేపట్టారు. దిల్లీలోని అధికారిక కార్యాలయాలకు ఇద్దరు మంత్రులు వెళ్లారు. దస్త్రాలపై సంతకాలు చేసి బాధ్యతలు స్వీకరించారు. ఆయా శాఖల అధికారులు వారికి పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు.
బాధ్యతలు స్వీకరించిన కేంద్రమంత్రులు రవి శంకర్, స్మృతి - ravi shankar prasad
కేంద్రమంత్రులు రవిశంకర్ ప్రసాద్, స్మృతి ఇరానీ పదవీ బాధ్యతలు స్వీకరించారు. న్యాయ శాఖ మంత్రిగా రవిశంకర్ ప్రసాద్... మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా స్మృతి కొనసాగనున్నారు.
బాధ్యతలు స్వీకరించిన కేంద్రమంత్రులు రవి శంకర్, స్మృతి
మే 30న ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. అదే కార్యక్రమంలో కేబినెట్ మంత్రులుగా రవిశంకర్, స్మృతి ప్రమాణం చేశారు.
ఇదీ చూడండి: 'అన్ని రాష్ట్రాల్లో హిందీ' పై నిర్ణయం తీసుకోలేదు: జైశంకర్