కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు కేంద్ర కార్పొరేట్ వ్వవహారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్. ఆ పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ చేసిన రబ్బర్ స్టాంప్ విమర్శలను తిప్పికొట్టారు. కేంద్ర మంత్రులేమీ రబ్బరు స్టాంపులు కాదని సమాధానమిచ్చారు. రాజ్యాంగం ప్రకారం ప్రధానమంత్రి కేటాయించిన విధులను నిర్వర్తిస్తున్నట్లు స్పష్టం చేశారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని హమిర్‌పుర్‌లో పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) ఆధ్వర్యంలో చేపట్టిన కస్టమర్ ఔట్రీచ్ ప్రోగ్రాం (సీఓపీ) కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు ఠాకూర్.
" ఆనంద్ శర్మకు భాజపాను విమర్శించే అలవాటు ఉంది. కాంగ్రెస్ నాయకులు అధికార పార్టీపై విమర్శలు చేసే ముందు నిజానిజాలు తెలుసుకోవాలి."