తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దుప్పట్ల కోసం కేంద్ర మంత్రి ధర్నా

అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చూపిస్తున్నారని.. అధికారుల తీరును నిరసిస్తూ ప్రజలు రోడ్డెక్కిన సందర్భాలు కోకొల్లలు. అయితే.. ఇక్కడ విరుద్ధంగా జరిగింది. ఒడిశాలోని బాలేశ్వర్​ జిల్లా ప్రధానాస్పత్రిలో సదుపాయాలు సరిగా లేవని.. ఏకంగా కేంద్ర మంత్రే రోడ్డెక్కారు. బాధితులతో కలిసి.. బైఠాయించారు.

union-minister-pratap-sarangi-on-dharana-against-dirty-bed-sheets-in-the-hospital
దుప్పట్ల కోసం కేంద్ర మంత్రి ధర్నా..!

By

Published : Jan 2, 2020, 11:38 AM IST

Updated : Jan 2, 2020, 2:50 PM IST

దుప్పట్ల కోసం కేంద్ర మంత్రి ధర్నా

ఎక్కడైనా అధికారుల తీరును నిరసిస్తూ.. ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేయడం చూసే ఉంటాం. కానీ ఇక్కడ ఏకంగా కేంద్ర మంత్రి, భాజపా ఎంపీనే ధర్నాకు దిగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఒడిశాలోని బాలేశ్వర్​ జిల్లా ప్రధానాస్పత్రిలో బెడ్​షీట్లు సరిగా లేవని నిరసన వ్యక్తం చేశారు స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి ప్రతాప్​ చంద్ర సారంగి. ప్రజల నేతగా పేరుగాంచిన ఆయన.. ప్రజల కోసం ఆందోళనకు దిగారు. వారితో కలిసి రోడ్డుపై చాలాసేపు బైఠాయించారు. దుప్పట్లు మురికిగా ఉన్నాయని.. ఆసుపత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

'ఒడిశా' మోదీ...

ప్రతాప్​ సారంగిని 'ఒడిశా మోదీ'గానూ పిలుస్తారు. నిరాడంబర జీవితం సాగించే ఆయనంటే జనానికి విపరీతమైన అభిమానం.

2019 లోక్​సభ ఎన్నికల్లో ఒడిశాలోని బాలేశ్వర్​ నుంచి పార్లమెంటు సభ్యునిగా విజయం సాధించారు. ప్రస్తుతం కేంద్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయమంత్రిగా ఉన్నారు.

ఇదీ చూడండి: ఆటోలో ప్రచారం చేసి.. గెలిచిన 'ఒడిశా మోదీ'

Last Updated : Jan 2, 2020, 2:50 PM IST

ABOUT THE AUTHOR

...view details