తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నితిన్​ గడ్కరీ బాధ్యతల స్వీకరణ - NITIN

రోడ్డు రవాణా, రహదారుల శాఖ కేంద్ర మంత్రిగా నియమితులైన నితిన్​ గడ్కరీ బాధ్యతలు స్వీకరించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్​ఎంఈ) మంత్రిగానూ విధులు చేపట్టారు. ప్రతాప్​ చంద్ర సారంగి ఇదే శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

నితిన్​ గడ్కరీ బాధ్యతలు స్వీకరణ

By

Published : Jun 4, 2019, 12:02 PM IST

రోడ్డు రవాణా, రహదారుల శాఖ కేంద్ర మంత్రిగానితిన్​ గడ్కరీనేడు బాధ్యతలు స్వీకరించారు. నరేంద్ర మోదీ మంత్రివర్గంలో వరుసగా రెండో సారి నియమితులైన గడ్కరీ.. దిల్లీలోని కార్యాలయంలో విధులకు హాజరయ్యారు. అనంతరం.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిగానూ బాధ్యతలు చేపట్టారు. పలు కీలక దస్త్రాలపై సంతకాలు చేశారు.

కేంద్ర మంత్రులుగా పలువురి బాధ్యతల స్వీకరణ

ఒడిశాలోని బాలాసోర్​ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ ప్రతాప్​ చంద్ర సారంగి...సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రిగా...

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగాసోమవారం బాధ్యతలు చేపట్టిన హర్షవర్ధన్​.. నేడు శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రిగా విధులు స్వీకరించారు.

ఇదీ చూడండి:

సామాజిక మాధ్యమాలకు ఐటీ మంత్రి హెచ్చరిక

ABOUT THE AUTHOR

...view details