తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పోలీసు అమర వీరులకు అమిత్​ షా నివాళులు - Amit Shah

దిల్లీలోని జాతీయ పోలీసు స్మారక స్థూపం వద్ద కేంద్ర హోంమంత్రి అమిత్​ షా నివాళులు అర్పించారు. అనంతరం పలువురు అధికారులతో కలిసి పోలీసు మ్యూజియాన్ని సందర్శించారు.

పోలీసు అమర వీరులకు అమిత్​ షా నివాళులు

By

Published : Jun 2, 2019, 11:54 AM IST

Updated : Jun 2, 2019, 12:27 PM IST

పోలీసు అమర వీరులకు అమిత్​ షా నివాళులు

కేంద్ర హోంమంత్రి అమిత్​ షా​ దిల్లీలోని జాతీయ పోలీసు స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం పలువురు హోంశాఖ అధికారులతో కలిసి జాతీయ పోలీసు మ్యూజియాన్ని సందర్శించారు. కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి చాణక్యపురిలోని పోలీసు స్మారకాన్ని సందర్శించారు షా. ఈ సందర్భంగా దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన అమర వీరుల గురించి హోంమంత్రికి వివరించారు అధికారులు.

మూడు రోజుల క్రితమే కేంద్ర మంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు షా. ప్రధాని మోదీ కేబినెట్​లో హోంమంత్రిగా శనివారమే బాధ్యతలు స్వీకరించారు.

ఇదీ చూడండి : భారత రాయబారి ఇఫ్తార్​ విందుకు పాక్ ​అటంకం

Last Updated : Jun 2, 2019, 12:27 PM IST

ABOUT THE AUTHOR

...view details