కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్) హరియాణాలోని గురుగ్రామ్‌లో నిర్వహిస్తున్న 'మెగా ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్'లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు.
ఉదయం 9:30 గంటలకు కదర్పుర్లోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) అధికారుల శిక్షణా అకాడమీని అమిత్ షా సందర్శించారు. తరువాత స్వయంగా మొక్కలు నాటి, వాటికి నీళ్లు పోశారు.
హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ కార్యక్రమంలో సీఏపీఎఫ్‌కు చెందిన 5 శాఖల అధిపతులు సహా ఇతర కేంద్ర దళాల ప్రముఖులు పాల్గొన్నారు. వీరిని ఉద్దేశించి అమిత్ షా ప్రసంగించారు.
"కరోనా మహమ్మారిపై భారత్ సమర్థవంతంగా పోరాడుతోంది. ఇందులో భద్రతా దళాల కృషి ఎంతో ఉంది."
- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
మంచి లక్ష్యం
సీఏపీఎఫ్ బలగాలు ఈ నెలలో 1.35 కోట్లకు పైగా మొక్కలు నాటడమే లక్ష్యంగా 'మెగా ట్రీ ప్లాంటేషన్' డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టాయి.
సీఏపీఎఫ్లో... సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్ఎఫ్, ఎస్ఎస్బీ ఉప విభాగాలుగా ఉంటాయి. ఈ దళాల్లో సుమారు 10 లక్షల మంది సిబ్బంది సేవలు అందిస్తున్నారు. శాంతి భద్రతల నిర్వహణ, సరిహద్దు సంరక్షణ, తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను ఇవి నిర్వహిస్తుంటాయి.
మెగా ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్‌లో పాల్గొన్న అమిత్ షా మొక్కకు నీళ్లు పోస్తున్న అమిత్ షా ఇదీ చూడండి:దేశంలో మరో 28,637 కేసులు.. 551 మరణాలు