తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు కేంద్ర కేబినెట్​, మంత్రిమండలి భేటీ - 'ముమ్మారు​ తలాక్ నిషేధం'

కేంద్ర మంత్రిమండలి నేడు మొదటిసారిగా సమావేశం కానుంది. ఈ భేటీలో ప్రభుత్వ విధివిధానాలపై ప్రధాని నరేంద్రమోదీ మంత్రులకు మార్గనిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి ముందు కేంద్ర కేబినెట్​ భేటీ జరగనుంది.

నేడు కేంద్ర కేబినెట్​, మంత్రిమండలి భేటీ

By

Published : Jun 12, 2019, 5:10 AM IST

Updated : Jun 12, 2019, 10:01 AM IST

నేడు కేంద్ర కేబినెట్​, మంత్రిమండలి భేటీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రిమండలి నేడు తొలిసారి సమావేశం కానుంది. నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన మంత్రులకు వారి బాధ్యతలపై ప్రధాని దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా మంత్రిత్వశాఖల నిర్వహణలో తీసుకోవాల్సిన చర్యలను మోదీ వివరిస్తారు. అలాగే సహాయమంత్రుల బాధ్యతలపైనా నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.

రాబోయే ఐదేళ్లలో చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికపై మంత్రుల అభిప్రాయాలను మోదీ తెలుసుకోనున్నారు. అలాగే మంత్రుల పనితీరునూ ప్రధాని సమీక్షించనున్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి అంశాలపై తీసుకోవాల్సిన చర్యలను ప్రధాని మోదీ కేంద్రమంత్రులకు వివరిస్తారు.

కేబినెట్​ సమావేశం..

మంత్రి మండలి సమావేశానికి కంటే ముందు కేంద్ర కేబినెట్​ భేటీ కానుంది. వచ్చేవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో... ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కోవాలో ఈ సమావేశంలో చర్చించనున్నారు. కేబినెట్ సమావేశంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్​ నిధి​ పథకం ద్వారా రైతులందరికీ ఏడాదికి రూ.6 వేల పెట్టుబడిసాయం ఇచ్చే నిర్ణయానికి మంత్రులు ఆమోదం తెలపనున్నారు.

సరికొత్తగా ముమ్మారు తలాక్​..

ఈ కేబినెట్ సమావేశంలో 'ముమ్మారు​ తలాక్' బిల్లును సరికొత్తగా ప్రవేశపెట్టాలనే ప్రతిపాదన చేసే అవకాశం ఉంది. 16వ లోక్​సభలో ప్రవేశపెట్టిన తలాక్​ బిల్లుకు కాలపరిమితి ముగిసింది. ఈ కారణంగా తాజాగా మరోసారి ముమ్మారు తలాక్​ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇదీ చూడండి: నీరవ్ బెయిల్ తీర్పు రేపటికి వాయిదా

Last Updated : Jun 12, 2019, 10:01 AM IST

ABOUT THE AUTHOR

...view details