కాంగ్రెస్‌లో అసమ్మతివాదుల సమస్య సమసిపోయినట్లు కనిపించడం లేదు. పార్టీలో సంస్థాగత మార్పులు చేయాలంటూ లేఖ రాసిన 23 మంది సభ్యుల్లో ఒకరైన సీనియర్ నేత కపిల్ సిబల్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్న భాజపాపై సర్జికల్ స్ట్రైక్స్(లక్ష్యంగా చేసుకోవాలని ఉద్దేశంతో) చేయాల్సిందిపోయి... సొంత పార్టీ నేత జితిన్ ప్రసాదను పార్టీ లక్ష్యంగా చేసుకుంటోందని ధ్వజమెత్తారు.
"ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికారికంగా జితిన్ ప్రసాదను లక్ష్యంగా చేసుకోవడం దురదృష్టకరం. సొంతనేతలను లక్ష్యంగా చేసుకొని శక్తిసామర్థ్యాలను వృథా చేసుకోకుండా భాజపాపై లక్షిత దాడులకు ప్రయత్నించాలి."
-కపిల్ సిబల్, కాంగ్రెస్ సీనియర్ నేత
ఈ ట్వీట్‌పై మరో కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ స్పందించారు. 'ముందుచూపుతో' అనే ఒక్క పదాన్ని ట్వీట్ చేశారు. లేఖ రాసినవారిలో తివారీ సైతం ఉన్నారు.