తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్​ మేనిఫెస్టో అబద్ధాల పుట్ట : షా

కాంగ్రెస్​ పార్టీ మేనిఫెస్టోపై విమర్శలు గుప్పించారు భాజపా నేతలు. సాధ్యం కాని హామీలను రాహుల్​ గాంధీ ప్రకటించారని ఆరోపించారు. ఉగ్రవాదులు, వేర్పాటువాదులకు ఉపకరించే అంశాలు మేనిఫెస్టోలో ఉన్నాయని దుయ్యబట్టారు.

అమిత్​ షా, సుష్మా స్వరాజ్​

By

Published : Apr 3, 2019, 6:45 AM IST

Updated : Apr 3, 2019, 8:28 AM IST

కాంగ్రెస్​ మేనిఫెస్టో అబద్ధాల పుట్ట : షా
కాంగ్రెస్​ మేనిఫెస్టో అంతా అబద్ధాల పుట్ట అని విమర్శించారు భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్​ షా. దేశ ప్రజలను, ధీరులైన సైనికులను అవమానించేలా మేనిఫెస్టోను కాంగ్రెస్​ రూపొందించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సెక్షన్​ 124ఏ(దేశద్రోహ చట్టం) రద్దు చేయడం, సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని సమీక్షించడం లాంటి కాంగ్రెస్​ హామీలు... ఉగ్రవాదులు, వేర్పాటువాదులకు సహకరించే విధంగా ఉన్నాయని అమిత్​ షా ఆరోపించారు. రాజద్రోహ చట్టాన్ని రద్దు చేయడం వల్ల దేశం విచ్ఛిన్నం అవుతుందని హెచ్చరించారు.

వేర్పాటువాదులకు, దేశద్రోహులకే మేలు

వేర్పాటువాదులు, దేశ ద్రోహులకు మాత్రమే సంతోషం కలిగించేలా కాంగ్రెస్​ మేనిఫెస్టో ఉందని విమర్శించారు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్​. మహారాష్ట్రలోని నాగ్​పూర్​లో జరిగిన భాజపా మహిళా కార్యకర్తల సమావేశంలో ఆమె ప్రసంగించారు. మెరుపుదాడులు, వాయుదాడులతో భారత సైన్యం, ప్రధాని నరేంద్ర మోదీ... పాకిస్థాన్​ ఉగ్రవాదుల భరతం పడుతుంటే, కాంగ్రెస్​ మాత్రం దేశ ద్రోహం తప్పుకాదని మాట్లాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు సుష్మ.

ప్రధానిగా మరోసారి నరేంద్ర మోదీనే ప్రజలు ఎన్నుకుంటారని తనకు పూర్తి విశ్వాసముందన్నారు సుష్మా స్వరాజ్​. కాంగ్రెస్​ అధికారంలో ఉన్నప్పుడు ఉగ్రదాడులకు సరైన సమాధానం చెప్పలేకపోయిందని విమర్శించారు.

Last Updated : Apr 3, 2019, 8:28 AM IST

ABOUT THE AUTHOR

...view details