దేశవ్యాప్తంగా యూకే రకం కరోనా వైరస్ కేసుల్లో రోజురోజుకూ పెరుగుదల కనిపిస్తోంది. శనివారం నాటికి కొత్త రకం వైరస్ కేసుల సంఖ్య 90కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీని బారిన పడిన వారందరిని ఐసోలేషన్‌లో ఉంచినట్లు తెలిపింది. అలాగే వారి తోటి ప్రయాణికులు, కుటుంబ సభ్యులను గుర్తిస్తున్నట్లు పేర్కొంది.
బ్రిటన్‌లో ఉత్పరివర్తన చెందిన ఈ వైరస్.. అక్కడ వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకూ అక్కడ కొత్త కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అమెరికా, డెన్మార్క్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, సింగపూర్ వంటి దేశాల్లోనూ ఈ కొత్త రకం వైరస్ కేసులు నమోదవుతున్నాయి.