డిగ్రీ నకిలీ పట్టాలను అరికట్టేందుకు చర్యలకు ఉపక్రమించింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ). ఇకపై విద్యార్థుల ధ్రువపత్రాలపై హోలోగ్రామ్, క్యూఆర్ కోడ్లను ముద్రించాలని అన్ని ఉన్నత విద్యాసంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విధానంతో సముచిత ధ్రువీకరణతో పాటు నకిలీలను అరికట్టవచ్చని పేర్కొంది.
"విద్యార్థుల మార్కుల జాబితాల్లో భద్రతా అంశాలపై దృష్టి పెట్టాలి. ధ్రువీకరణ, నకిలీ పత్రాలను అరికట్టేందుకు ఇవి ఉపయోగపడాలి. డిగ్రీ పట్టాలపై విద్యార్థి ఫొటో, విద్యాసంస్థ హోలోగ్రామ్, క్యూఆర్ కోడ్ ముద్రణ తప్పనిసరి చేయాలి. ఈ సమాచారంతో విద్యార్థి పూర్తి వివరాలు తెలిసేలా రూపొందించాలి. "