ప్రస్తుత సమాజంలో రెండు చేతులా సంపాదిస్తున్న వారు కూడా దానం చేసే ముందు కొంచెం ఆలోచిస్తారు. కానీ, కర్ణాటకలోని ఉడిపి నగరానికి చెందిన రోజు కూలీ రవికుమార్ మాత్రం అందుకు భిన్నం. దానం చేసేంత ఆస్తి లేకున్నా... తన చుట్టూ సాయం కోసం ఎదురు చూస్తున్న వారికి తోడుగా నిలుస్తున్నారు. ఖాళీ సమయం ఉన్నప్పుడు, ప్రత్యేకంగా పండుగ రోజుల్లో స్పైడర్‌మ్యాన్, ద మమ్మీ రిటర్న్స్‌లోని ఇంఫోటెప్ తదితర వేషధారణలతో స్థానికులకు వినోదం పంచుతారు. అలా సంపాదించిన డబ్బును దివ్యాంగుల, పేదవారి శ్రేయస్సుకు వినియోగిస్తున్నారు.
దివ్యాంగులు, పేదల పాలిట సూపర్ హీరో - UDIPI
ఆర్థికంగా పేద. విలువల విషయంలో మాత్రం కుబేరుడు. ఆ వ్యక్తిత్వమే అతడ్ని ఉడిపి వాసులకు సుపరిచితుడ్ని చేసింది. ఎవరా వ్యక్తి? ఏం చేస్తున్నాడు?
దివ్యాంగులు, పేదల పాలిట సూపర్ హీరో
పేదవారికి సాయం చేయాలన్న రవి ఆలోచనను ఆయన స్నేహితులు అభినందిస్తున్నారు. దాదాపు 80 మంది రవికుమార్‌కు అండగా నిలిచి తమవంతు ఆర్థికసాయం అందిస్తున్నారు.
ఇతరుల కోసం డబ్బు సంపాదించడంలో ఎంతో ఆనందం ఉందని రవికుమార్ చెబుతున్నారు.