తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీఎం అయ్యాక తొలిసారి మోదీని కలిసిన ఠాక్రే - మోదీతో ఉద్ధవ్ తొలి భేటీ

భాజపా కూటమిని వీడి.. ఎన్​సీపీ, కాంగ్రెస్​ల మద్దతుతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలి సారి ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు ఉద్ధవ్​ ఠాక్రే. ఓ అధికారిక కార్యక్రమానికి మహారాష్ట్ర వచ్చిన మోదీకి.. ఠాక్రే సహా, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, గవర్నర్ కోశ్యారీ, మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్​లు పుణె విమానాశ్రయంలో స్వాగతం పలికారు.

UDDHAV
మోదీని కలిసిన ఉద్ధవ్ ఠాక్రేతో

By

Published : Dec 7, 2019, 7:29 AM IST

ఉద్ధవ్ ఠాక్రే.. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఓ అధికారిక కార్యక్రమానికి హాజరయ్యేందుకు మహారాష్ట్ర వచ్చిన ప్రధానికి.. సీఎం ఉద్ధవ్​ ఠాక్రే.. పుణె విమానాశ్రయంలో స్వాగతం పలికారు.

భాజపా కూటమిని వీడిన శివసేన పార్టీ.. ఎన్​సీపీ, కాంగ్రెస్​ మద్దతుతో మహారాష్ట్ర గద్దెనెక్కిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో మోదీ, ఠాక్రేలు తొలిసారి కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించికుంది.

పుణె విమానాశ్రయంలో ఠాక్రేతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా, మహారాష్ట్ర గవర్నర్​ భగత్​ సింగ్​ కోశ్యారీ, భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్​లు ప్రధానికి స్వాగతం పలికారు.

మోదీకి స్వాగతం పలుకుతున్న అమిత్ షా
మోదీతో కరచాలనం చేస్తున్న కోశ్యారీ

ప్రధానిని కలిసిన తర్వాత.. ఉద్ధవ్​ ఠాక్రే తిరిగి ముంబయి బయల్దేరినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

పుణెలో మూడు రోజుల పాటు జరగనున్న 'నేషనల్​ కాన్ఫరెన్స్ ఆఫ్​ డైరెక్టర్​ జనరల్స్​ అండ్​ ఇన్​స్పెక్టర్​ జనరల్స్​ ఆఫ్​ పోలీస్'​.. కార్యక్రమానికి ప్రధాని మోదీ నేడు హాజరుకానున్నారు.

ఇదీ చూడండి:మృత్యువుతో పోరాడుతూ ఉన్నావ్​ ఘటన బాధితురాలు మృతి

ABOUT THE AUTHOR

...view details