తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అత్తారింటికి వెళ్తుండగా నవ వధువు కిడ్నాప్ - రాజస్థాన్

నెల రోజుల వ్యవధిలోనే రాజస్థాన్​ ఉదయ్​పుర్​లో వధువును  కిడ్నాప్​ చేసిన ఘటన మరొకటి జరిగింది. పెళ్లి పూర్తయి అత్తారింటికి మొదటిసారిగా వెళ్తున్న వధువును గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు.

అత్తారింటికి వెళ్తుండగా నవ వధువు కిడ్నాప్

By

Published : May 7, 2019, 4:56 PM IST

Updated : May 7, 2019, 6:20 PM IST

పెళ్లికి ముందు వధువు, వరుడు పారిపోయే సంఘటనలు సినిమాల్లో అనేకం చూసుంటాం. పెళ్లి పీటలపై నుంచి వధువును ఎత్తుకెళ్లడం ఓ స్టోరీ. పారిపోయిన ప్రేమికులను తల్లిదండ్రులు తిరిగి తీసుకురావడం, వేరేవారికిచ్చి వివాహం చేయడం మరో తరహా కథ.

ఇలాంటి కథలకు భిన్నంగా వివాహమై అత్తారింటికి వెళ్తున్న నవ వధువును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. రాజస్థాన్​లోని ఉదయ్​పుర్​లో జరిగిందీ సంఘటన. అప్పుడే పెళ్లి పూర్తయిన కొత్త జంట స్వగృహానికి బయలుదేరింది. మార్గమధ్యంలో వచ్చిన రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద కారు ఆగింది. మరో కారు వచ్చి పెళ్లి కారు పక్కనే ఆగింది. బైక్​పై వచ్చిన ఇద్దరు అగంతుకులు కారు పైకి లంఘించారు. వరుడిని బయటకు లాగి కొట్టి పడేశారు. నవ వధువును కార్లో ఎత్తుకెళ్లిపోయారు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వరుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఉదయ్​పుర్​లో 15 రోజుల క్రితం మారణాయుధాలతో బెదిరించి పెళ్లి కుమార్తెను ఎత్తుకెళ్లిన సంఘటన జరిగింది.

అత్తారింటికి వెళ్తుండగా నవ వధువు కిడ్నాప్

ఇదీ చూడండి: టార్గెట్​ మోదీ: ప్రియాంక నోట దుర్యోధనుడి కథ

Last Updated : May 7, 2019, 6:20 PM IST

ABOUT THE AUTHOR

...view details