తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ఇద్దరు ముష్కరులు హతం - కశ్మీర్​లో ఎన్​కౌంటర్ ఇద్దరు ఉగ్రవాదులు హతం

jk encounter
కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ఇద్దరు ముష్కరులు హతం

By

Published : Jun 13, 2020, 7:07 AM IST

Updated : Jun 13, 2020, 7:50 AM IST

07:43 June 13

జమ్ముకశ్మీర్​లోని కుల్గాం జిల్లా నిపోరాలో ఎన్​కౌంటర్​ జరిగింది. భద్రతా దళాలు ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల కదలికలపై నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు, భద్రతా దళాలు సంయుక్తంగా నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఇంతలో ముష్కరులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీటుగా స్పందించిన భద్రతా దళాలు ఇద్దరు గుర్తు తెలియని ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. పరిసర ప్రాంతాలను అదుపులోకి తీసుకున్న బలగాలు.. గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.

07:03 June 13

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ఇద్దరు ముష్కరులు హతం

జమ్ముకశ్మీర్​ కుల్గాం జిల్లా నిపోరా ప్రాంతంలో ఎన్​కౌంటర్​ జరిగింది. భద్రతా దళాలు, పోలీసులు చేసిన ఈ ఆపరేషన్​లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారు. పరిసర ప్రాంతాలను బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.

Last Updated : Jun 13, 2020, 7:50 AM IST

For All Latest Updates

TAGGED:

jk encounter

ABOUT THE AUTHOR

...view details