ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న భారత సైనిక స్థావరం సియాచిన్లో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ సియాచిన్లో గస్తీ విధుల్లో ఉన్న సైనికులపైకి మంచు తుపాను విరుచుకుపడి ఈ ప్రమాదం జరిగింది.
సముద్ర మట్టానికీ దాదాపు 18వేల అడుగుల ఎత్తున శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగిన వెంటనే సహాయక బృందం రంగంలోకి దిగింది. మంచు చరియల కింద చిక్కుకున్న సైనికుల్ని గుర్తించి, బయటకు తీసుకువచ్చింది. వారిని అక్కడి నుంచి సైనిక హెలికాఫ్టర్లలో తరలించినా ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారని అధికార వర్గాలు తెలిపాయి.