తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎమ్మెల్యే హత్యలో ప్రమేయమున్న మావోల హతం - భీమా మండావి

ఛత్తీస్​గఢ్​లో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనలో ఇద్దరు మావోలు మృతి చెందారు. వీరు ఇరువురికి భాజపా ఎమ్మెల్యే భీమా మండావి హత్య ఘటనలో ప్రమేయముందని పోలీసులు గుర్తించారు.

ఎమ్మెల్యే హత్యలో ప్రమేయమున్న ఇద్దరు మావోల హతం

By

Published : Apr 18, 2019, 10:12 AM IST

Updated : Apr 18, 2019, 12:46 PM IST

ఎమ్మెల్యే హత్యలో ప్రమేయమున్న మావోల హతం

ఛత్తీస్​గఢ్​ దంతెవాడ ఎమ్మెల్యే భీమా మండావి హత్యలో పాలుపంచుకున్న ఇద్దరు మావోయిస్టులను ​ భద్రతా దళాలు హతమార్చాయి. దౌవులికర్కా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్​కౌంటర్​లో వీరిని మట్టుబెట్టాయి.

ఉదయాన్నే మావోయిస్టులు,'జిల్లా రిజర్వు గార్డ్​(డీఆర్​జీ)' సిబ్బంది మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఘటన అనంతరం ఇద్దరు మావోల మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఒక 315 బోర్​ గన్​కు కూడా స్వాధీనం చేసుకున్నారు. మృతులు వర్గీసె, లింగాలుగా గుర్తించారు పోలీసులు.

ఈ నెల 9న దంతెవాడ భాజపా ఎమ్మెల్యే మండావితో పాటు ఆయన నలుగురు అనుచరులను హత్య చేశారు మావోయిస్టులు.

Last Updated : Apr 18, 2019, 12:46 PM IST

ABOUT THE AUTHOR

...view details