తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హిజ్బుల్​ కమాండర్ సహా ఐదుగురు ఉగ్రవాదులు హతం - encounter in jammu kashimr

Two more militants killed in encounter with security forces in Shopian
కశ్మీర్​ ఎన్​కౌంటర్లో మరో ఇద్దరు ఉగ్రవాదులు హతం

By

Published : Jun 7, 2020, 5:41 PM IST

Updated : Jun 7, 2020, 8:44 PM IST

20:37 June 07

హిజ్బుల్​ కమాండర్ సహా ఐదుగురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌ షోపియాన్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో హిజ్బుల్ ముజాహిద్దీన్  ఉగ్రవాద సంస్థకు చెందిన ఓ కమాండర్ సహా ఐదుగురు ఉగ్రవాదులను భద్రతాబలగాల మట్టుబెట్టాయి. ఉగ్రవాదులు ఆశ్రయం పొందారన్న సమాచారం మేరకు రెబన్ ప్రాంతంలో సైనిక బలగాలు ఇవాళ ఉదయం తనిఖీలు నిర్వహించాయి. ఈ సమయంలో సైన్యానికి తారసపడిన ఉగ్రవాదులు భద్రతా బలగాలపై ఏకపక్షంగా కాల్పులకి తెగబడగా సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. ఉదయం నుంచి ఎదురుకాల్పులు కొనసాగాయి.

ఈ కాల్పుల్లో హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థకు చెందిన ఐదు మంది ముష్కరులు హతమైనట్లు  అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

17:58 June 07

కశ్మీర్​ ఎన్​కౌంటర్​లో మరో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. షోపియాన్​ జిల్లాలోని రెబన్​ ప్రాంతంలో ఈరోజు ఉదయం ముగ్గురుని మట్టుబెట్టిన భద్రత దళాలు.. తాజాగా మరో ఇద్దరిని హతమార్చాయి.  

" షోపియన్​ జిల్లాలోని రెబన్​ ప్రాంతంలో జరుగుతోన్న ఆపరేషన్​లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రత దళాలకు ఎలాంటి నష్టం జరగలేదు. దక్షిణ కశ్మీర్​లోని షోపియాన్​ జిల్లా రెబన్​ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో ఈరోజు ఉదయం తనిఖీలు చేపట్టాయి బలగాలు. ఈ క్రమంలో సైనికులపై కాల్పులకు తెగబడ్డారు ముష్కరులు. ఇరు వర్గాల మధ్య ఉదయం నుంచి ఎదురుకాల్పులు జరుగుతున్నాయి."  

          - కోల్​ రాజేశ్​ కాలియా, రక్షణ శాఖ ప్రతినిధి

ముష్కరుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు అధికారులు. ప్రస్తుతానికి మృతిచెందిన తీవ్రవాదుల గుర్తింపు, ఏ సంస్థకు చెందిన వారనేది తెలియాల్సి ఉందన్నారు.  

17:36 June 07

కశ్మీర్​ ఎన్​కౌంటర్​లో మరో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్​లోని షోపియాన్​ జిల్లాలో మరో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. ఇదివరకే ముగ్గురిని హతమార్చగా.. తాజాగా మరో ఇద్దరిని మట్టుబెట్టాుయి. వీరితో కలిపి మొత్తం మరణించిన తీవ్రవాదుల సంఖ్య 5కు చేరింది. ఉద్రవాదుల కోసం ఈ ఉదయం నుంచి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Last Updated : Jun 7, 2020, 8:44 PM IST

ABOUT THE AUTHOR

...view details