తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ట్రక్కు ఢీకొని ప్రాణాలు కోల్పోయిన గజరాజులు - ఒడిశా

ఒడిశా కేందుజర్​ జిల్లా... బలిజోడి గ్రామంలో కంటైనర్ ఢీకొని 3 ఏనుగులు మృత్యువాత పడ్డాయి. అనంతరం.. ఆ వాహనమూ అదుపుతప్పి పడిపోయింది. డ్రైవర్​ పరారయ్యాడు. ఈ ఘటనపై అటవీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్రక్కు ఢీకొని ప్రాణాలు కోల్పోయిన గజరాజులు

By

Published : Aug 22, 2019, 6:03 PM IST

Updated : Sep 27, 2019, 9:47 PM IST

ఒడిశా ఘటాగాంవ్​ అటవీ ప్రాంతం పరిధిలోని బలిజోడిలో జాతీయ రహదారిపై ఘోరప్రమాదం జరిగింది. అప్పుడే రోడ్డు దాటుతున్న ఏనుగుల గుంపును అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో మూడు గజరాజులు మృత్యువాత పడ్డాయి.

ట్రక్కు ఢీకొని ప్రాణాలు కోల్పోయిన గజరాజులు

ఏనుగులను ఢీకొట్టిన తర్వాత.. వాహనం అదుపు తప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్​ పారిపోయాడు. కానీ.. అతని సహాయకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు.. ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Sep 27, 2019, 9:47 PM IST

ABOUT THE AUTHOR

...view details