తమిళనాడులో ఘోర ప్రమాదం సంభవించింది. రాష్ట్రంలో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా కోయంబత్తూర్ చెట్టి వీధిలో ఆదివారం రాత్రి ఓ భవనం కుప్పకూలింది. ఘటనలోఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఓ మహిళ కూడా ఉన్నారు. మరో అయిదుగురికి గాయాలయ్యాయి.
తమిళనాడులో భవనం కూలి ఇద్దరు మృతి - తమిళనాడు తాజా వార్తలు
తమిళనాడులో కురుస్తోన్న భారీ వర్షాలకు కోయంబత్తూర్లో ఆదివారం రాత్రి ఓ భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు.
తమిళనాడులో భవనం కూలి ఇద్దరు మృతి
భారీ వర్షాలకు ఈదురు గాలులు తోడు కావడం వల్ల భవనం అకస్మాత్తుగా నేలకూలింది. శిథిలాల్లో 8 మంది చిక్కుకోగా.. పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఏడుగురిని వెలికితీశారు. వారిలో ఇద్దరు మరణించారని అధికారులు తెలిపారు. మరొకరి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి:గుజరాత్లో భారీ వర్షాలు- రహదారులు జలమయం
Last Updated : Sep 7, 2020, 11:09 AM IST