'చైనాలో లద్దాఖ్'ను చూపి భారతీయుల మనోభావాలను దెబ్బతీసినందుకు ట్విట్టర్ క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు పార్లమెంటరీ ప్యానెల్‌కు లిఖితపూర్వక అఫిడవిట్ అందజేసినట్లు కమిటీ ఛైర్పర్సన్ మీనాక్షి లేఖి తెలిపారు.
'చైనాలో లద్దాఖ్' వివాదంలో ట్విట్టర్ క్షమాపణలు - భారత్ వర్సెస్ ట్విట్టర్
17:09 November 18
పార్లమెంటరీ ప్యానెల్‌కు ట్విట్టర్ లిఖితపూర్వక అఫిడవిట్
లద్దాఖ్ జియో ట్యాగింగ్‌ను తప్పుగా చూపినందుకు క్షమాపణలు చెబుతూ అఫిడవిట్‌పై ట్విట్టర్ గోప్యత విభాగం అధికారి డేమియెన్ కరీన్ సంతకం చేశారు. నవంబర్ 30లోపు ఈ తప్పిదాన్ని సరిచేస్తామని హామీ ఇచ్చింది ట్విట్టర్.
ప్యానెల్ ఆదేశాలు..
లద్దాఖ్ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పార్లమెంటరీ సంయుక్త కమిటీ.. లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని, ఈ విషయంపై అఫిడవిట్‌ను సమర్పించాలని అక్టోబర్ 28న ట్విట్టర్‌ను ఆదేశించింది. మరుసటి రోజు మౌఖికంగా క్షమాపణలు తెలిపిన ట్విట్టర్... తమ సంస్థ భారత దేశ సున్నితమైన అంశాలను గౌరవిస్తుందని పునరుద్ఘాటించింది.
ఇదీ చూడండి:'చైనాలో లద్దాఖ్'పై ట్విట్టర్‌కు మరిన్ని చిక్కులు!