తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఏఎన్​-32' ప్రమాద మృతులకు ట్విట్టర్​లో నివాళులు

ఏఎన్​-32 యుద్ధవిమాన ప్రమాదంలో మరణించిన 13 మందికి ట్విట్టర్లో నెటిజన్లు నివాళులు అర్పించారు. మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. హరియాణా, పంజాబ్​, అరుణాచల్​ ప్రదేశ్​ ముఖ్యమంత్రులు అమరులకు నివాళులర్పిస్తూ ట్వీట్లు చేశారు.

'ఏఎన్​-32' ప్రమాద మృతులకు ట్విట్టర్​లో నివాళులు

By

Published : Jun 13, 2019, 9:10 PM IST

ఏఎన్​-32 యుద్ధవిమాన ప్రమాదంలో మృతిచెందిన 13 మంది కుటుంబ సభ్యులకు ట్విట్టర్​లో సానుభూతి తెలిపారు కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ. సాహసవీరుల త్యాగాలకు దేశం రుణపడి ఉంటుందని కాంగ్రెస్​ ట్వీట్​ చేసింది.

" తప్పిపోయిన ఏఎన్​-32 యుద్ధవిమానంలోని 13 మంది క్షేమంగా ఉండాలని పదిరోజులుగా దేశ ప్రజలంతా ప్రార్థించారు. వారందరూ మృతిచెందడం విచారకరం. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 13 మంది కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. "
-రాహుల్​ గాంధీ ట్వీట్.

పంజాబ్​, అరుణాచల్​ ప్రదేశ్​, హరియాణా ముఖ్యమంత్రులు.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్లు చేశారు.

జూన్‌ 3న అరుణాచల్​ ప్రదేశ్​ సియాంగ్ జిల్లా పయూమ్‌ పరిధిలో ఏఎన్​-32 విమానం గల్లంతయింది. ఈ విమానంలో ప్రయాణించిన వారంతా ప్రాణాలు కోల్పోయినట్లు భారత వాయుసేన గురువారం అధికారికంగా ట్విట్టర్​ ద్వారా తెలిపింది. వెంటనే ట్విట్టర్​ నెటిజన్లంతా మృతులకు సంతాపం తెలుపుతూ ట్వీట్లు చేశారు.

"ఏఎన్​-32 విమాన ప్రమాదంలో అమరులైన వాయు సైనికులకు నివాళులు అర్పిస్తున్నా'
-ట్విట్టర్​లో ఓ నెటిజన్​​​

"విచారకర వార్త. ధీరులకు నివాళులు. వారంతా ప్రమాదంలో మరణించారని, సాయం అందక కాదని అధికారులు స్పష్టత ఇవ్వగలరా? శవపరీక్షలో నిజాలు తెలుస్తాయి."
-ఓ నెటిజన్​ ట్వీట్​

ఇదీ చూడండి: ఏఎన్​-32 విమానంలో గల్లంతైన వారంతా మృతి

ABOUT THE AUTHOR

...view details