తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వెంటిలేటర్​పైనే ఉన్నావ్​ అత్యాచార బాధితురాలు - భాజపా

ఉన్నావ్​ అత్యాచార బాధితురాలి పరిస్థితి కొంత మెరుగుపడిందని వైద్యులు ప్రకటించారు. ఆదివారం రోడ్డుప్రమాదంలో బాధితురాలు తీవ్రంగా గాయడపడింది. ప్రమాదానికి సంబంధించి 10మందిపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేసింది  సీబీఐ. వీరిలో ఉత్తరప్రదేశ్​ మంత్రి అల్లుడి పేరు ఉంది. ఈ విషయంలో భాజపా ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.

వెంటిలేటర్​పైనే ఉన్నావ్​ అత్యాచార బాధితురాలు

By

Published : Aug 1, 2019, 5:00 AM IST

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఉన్నావ్ అత్యాచార​ బాధితురాలు ఇంకా వెంటిలేటర్​పైనే చికిత్స పొందుతోంది. అయితే బాధితురాలి ఆరోగ్యం కొంత మెరుగుపడిందని వైద్యులు ప్రకటించారు. తలకు గాయం కాలేదని, కానీ బాధితురాలు ఇంకా అపస్మారక స్థితిలోనే ఉందన్నారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమని వివరించారు.

రాయ్​బరేలీ జైలులోని తమ బంధువును చూసేందుకు... ఆదివారం బాధితురాలు సహా ఆమె కుటుంబ సభ్యులు, న్యాయవాది బయలుదేరారు. దారి మధ్యలో వారి వాహనాన్ని ఓ ట్రక్కు వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

బాధితురాలు 24 గంటలపాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటోంది. ఘటనలో గాయపడ్డ న్యాయవాది ఆరోగ్యం నిలకడగా ఉంది.

నేడు సుప్రీం విచారణ...

ఉత్తర్​ప్రదేశ్​ ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి కుటుంబం రాసిన లేఖను విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. నేడు ఈ కేసుపై వాదనలు విననుంది. సెన్​గర్​ నుంచి ప్రాణహాని ఉందని పేర్కొంటూ ఈ నెల 12న సీజేఐకు లేఖ రాసింది ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి కుటుంబం.

'అన్ని ఆధారాలున్నాయి...'

రోడ్డు ప్రమాదంపై బాధితురాలి మేనమామ మహేష్​ సింగ్​ స్పందించారు. బాధితురాలిపై భాజపా ఎమ్మెల్యే కుల్​దీప్​ సెన్​గర్​ అత్యాచారం చేశాడని ఆరోపించారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు.

రెండు దశాబ్దాల క్రితం సెన్​గర్​ తమ్ముడిపై దాడి కేసులో మహేష్​ జైలులో ఉన్నాడు. మహేష్​ను కలవడానికి ఆదివారం ఉన్నావ్​ అత్యాచార బాధితురాలు, కుటుంబ సభ్యులు రాయ్​బరేలికి బయలుదేరారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన ఇద్దరిలో మహేష్​ భార్య ఒకరు.

మహేష్​ భార్య అంత్యక్రియలు బుధవారం పటిష్ఠ భద్రత మధ్య గంగానది వద్ద జరిగాయి. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మహేష్​ పెరోల్​పై విడుదలయ్యాడు.

మంత్రి అల్లుడిపై ఎఫ్​ఐఆర్​...

రోడ్డు ప్రమాద ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారణ చేపట్టింది. సెన్​గర్​తో సహా 10 మందిపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేసింది. వీరిలో ఉత్తరప్రదేశ్​ వ్యవసాయ మంత్రి రణవేంద్ర ప్రతాప్​ అల్లుడు అరున్​ సింగ్​ పేరు కూడా ఉంది.

ఎఫ్​ఐఆర్​లో తన పేరు ఉండటాన్ని అరున్​ సింగ్​ తీవ్రంగా ఖండించారు. సంబంధం లేని విషయంలో ఇరికించడానికే తనపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారని ఆరోపించారు. ప్రస్తుతం అరున్​ సింగ్​ అమర్​నాథ్​ యాత్రలో ఉన్నారు.

భాజపాపై తీవ్ర విమర్శలు...

ఉన్నావ్​ బాధితురాలి అత్యాచారం, రోడ్డు ప్రమాదం ఘటనలతో ఇప్పటికే దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది భాజపా. తాజాగా యూపీ మంత్రి అల్లుడిపై ఎఫ్​ఐఆర్​ నమోదవడం వల్ల ఈ విమర్శలు తారా స్థాయికి చేరుకున్నాయి. బాధితురాలికి న్యాయం జరగాలని సర్వత్రా డిమాండ్​ పెరిగింది.

ఇదీ చూడండి- వైరల్​: కేకును తుపాకీతో పేల్చి బర్త్​డే సంబరాలు

ABOUT THE AUTHOR

...view details