తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​కు అమెరికా 13 నావికా తుపాకుల విక్రయం!

భారత నావికాదళం మరింత బలపడనుంది. సుమారు 1 బిలియన్​ డాలర్లు విలువ చేసే నావికా తుపాకులను భారత్​కు అమ్మడానికి అమెరికా నిర్ణయించింది. ఈ మేరకు ఆ దేశ కాంగ్రెస్​కు నోటిఫికేషన్​ అందించింది ట్రంప్​ సర్కార్​.

భారత్​కు అమెరికా 13 నావికా తుపాకుల విక్రయం

By

Published : Nov 21, 2019, 6:16 AM IST

Updated : Nov 21, 2019, 8:03 AM IST

భారత్​కు అమెరికా 13 నావికా తుపాకుల విక్రయం!

సుమారు 1 బిలియన్​ డాలర్లు(సుమారు 7వేల కోట్ల రూపాయలు) విలువచేసే నావికా తుపాకులను భారత్​కు విక్రయించడానికి నిర్ణయించింది అమెరికా. ఈ మేరకు అగ్రరాజ్య కాంగ్రెస్​కు తన నిర్ణయాన్ని వెల్లడించింది డొనాల్డ్​ ట్రంప్​ సర్కార్​.

ఈ ఆయుధాల వల్ల భారత నావికాదళం మరింత బలపడనుంది. శత్రువులకు చెందిన యుద్ధనౌకలు, విమానాలతో పోరాడటానికి నావికా తుపాకులను ఉపయోగించవచ్చు. వీటితో దేశ భద్రత మరింత మెరుగుపడుతుంది.

ప్రతిపాదిత 13 ఎమ్​కే-45 5ఇంచ్​/62 కాలిబర్​(ఎమ్​ఓడీ 4) నావికా తుపాకులు, వాటి సంబంధిత పరికరాల వ్యయం దాదాపు 1.02 బిలియన్​ డాలర్లని అగ్రరాజ్య రక్షణ సహకార సంస్థ తెలిపింది.

ఇప్పటివరకు ఆస్ట్రేలియా, జపాన్​, దక్షిణ కొరియాకు మాత్రమే ఎమ్​ఓడీ 4ను విక్రయించింది అమెరికా. తాజాగా ఈ జాబితాలోకి భారత్​ చేరింది. మరిన్ని మిత్ర దేశాలకు ఈ నావికా తుపాకులను అమ్మడానికి అగ్రరాజ్యం సిద్ధంగా ఉంది.

ఇదీ చూడండి:- 'వాయుసేన అమ్ములపొదిలో మూడు రఫేల్​ విమానాలు'

Last Updated : Nov 21, 2019, 8:03 AM IST

ABOUT THE AUTHOR

...view details