జీఎస్టీ బకాయిలు చెల్లించాలంటూ విపక్షాలు పార్లమెంటు ఎదుట గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగాయి. ప్రాంతీయ పార్టీలు తృణమూల్ కాంగ్రెస్, తెరాస, డీఎంకే, ఆర్జేడీ, ఆప్, ఎన్సీపీ, సమాజ్వాదీ, శివసేన పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులు ధర్నాలో పాల్గొన్నారు.
జీఎస్టీ బకాయిల కోసం విపక్షాల ధర్నా - coronavirus
రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ బకాయిలను చెల్లించాలని కోరుతూ విపక్షాలకు చెందిన ఎంపీలు పార్లమెంటు ఎదుట ధర్నాకు దిగారు. తృణమూల్ కాంగ్రెస్, తెరాస, ఆర్జేడీ సహా పలు ప్రాంతీయ పార్టీల సభ్యులు నిరసనలో పాల్గొన్నారు.
జీఎస్టీ బకాయిలు చెల్లించాలంటూ పార్లమెంటు ఎదుట ధర్నా
ప్రస్తుత కరోనా సంక్షోభ పరిస్థితుల్లో రాష్ట్రాలు ఆర్థికంగా నష్టపోయాయన్న నేతలు.. తక్షణమే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.