కరోనా విజృంభణ నేపథ్యంలో భౌతిక దూరాన్ని విధిగా పాటించాలని చెబుతూ వస్తోంది ప్రభుత్వం. బైక్పై ఒక్కరే ప్రయాణించాలని నిబంధన విధించింది. అయితే ప్రభుత్వ నిబంధనల మేరకు భౌతిక దూరం పాటిస్తూనే.. ఇద్దరు ప్రయాణించేలా ఓ బ్యాటరీ బైక్ను తయారు చేశాడు త్రిపురలోని ఆరాలియాకు చెందిన వాహన మెకానిక్ పార్థ సాహా.
'భౌతిక' బైక్ ఫీచర్స్ ఇవే..
ఈ బైక్కు ఉండే రెండు సీట్లను ఒక మీటరు కంటే ఎక్కువ దూరంలో అమర్చాడు సాహా. భౌతిక దూరం పాటించేలా ఈ అమరిక ఉంటుంది. పూర్తిగా ఛార్జ్ అయ్యేందుకు మూడు గంటల సమయం పడుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్ల దూరం వెళ్లగలదు. లిథియం అయాన్ బ్యాటరీ అమర్చిన ఈ బైక్కు గేర్లు ఉండవు.