తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లైవ్​: తలాక్​ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

By

Published : Jul 30, 2019, 11:45 AM IST

Updated : Jul 30, 2019, 6:51 PM IST

కాసేపట్లో రాజ్యసభ ముందుకు తలాక్​ బిల్లు

18:46 July 30

బిల్లుకు రాజ్యసభ ఆమోదం

ముమ్మారు తలాక్‌ బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించింది. బిల్లుకు అనుకూలంగా 99, వ్యతిరేకంగా 84 ఓట్లు వచ్చాయి. బిల్లును మొదట మూజువాణి ఓటుతో ఆమోదం తెలపగా, విపక్షాలు డివిజన్‌ కోరగా... ఓటింగ్ నిర్వహించారు.

18:18 July 30

వీగిపోయిన సెలక్ట్​ కమిటీ ప్రాతిపాదన

  • బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలనే ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఓటు
  • సెలెక్ట్ కమిటీకి పంపాలనే ప్రతిపాదనకు అనుకూలంగా84,వ్యతిరేకంగా100ఓట్లు

18:06 July 30

ఓటింగ్ ప్రారంభం

ముమ్మారు తలాక్ బిల్లు ఆమోదానికై  రాజ్యసభలో ఓటింగ్‌ ప్రారంభమైంది.

15:21 July 30

అన్నాడీఎంకే వాకౌట్...

బిల్లును వ్యతిరేకిస్తూ ఓటింగ్​ సమయంలో వాకౌట్​ చేస్తామని అన్నాడీఎంకే తెలిపింది.

14:21 July 30

వ్యతిరేకించనున్న వైకాపా...

ముమ్మారు తలాక్​ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్లు వైకాపా స్పష్టం చేసింది. ఓటింగ్​లో బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని ఆ పార్టీ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు.

14:06 July 30

తిరిగి ప్రారంభం...

వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన చర్చ. ముమ్మారు తలాక్ బిల్లుపై చర్చిస్తున్న సభ్యులు.

13:14 July 30

మధ్యాహ్నానికి వాయిదా...

రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. వాయిదా అనంతరం ముమ్మారు తలాక్​ బిల్లుపై చర్చ కొనసాగనుంది.

12:34 July 30

జేడీయూ వాకౌట్​...

ముమ్మారు తలాక్​ బిల్లును వ్యతిరేకిస్తూ సభ నుంచి ఎన్​డీఏ మిత్రపక్షం జేడీయూ సభ్యులు వాకౌట్​ చేశారు.

12:16 July 30

కాంగ్రెస్​ వాదన...

కాంగ్రెస్​ తరఫున అమీ యాగ్నిక్​​ మాట్లాడారు. 

"మహిళల సమస్యలపై మేజిస్ట్రేట్‌ కోర్టులో విచారణ సరికాదు. కుటుంబ కోర్టులోనే విచారించాలి. మహిళ.. తన పిల్లల సంరక్షణ, భరణంపై కోర్టులో మొరపెట్టుకునే పరిస్థితి ఉంది."  - అమీ యాగ్నిక్​​

12:04 July 30

చర్చ ప్రారంభం...

రాజ్యసభలో తలాక్​ బిల్లుపై చర్చ ప్రారంభమైంది. న్యాయశాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్ బిల్లును ప్రవేశపెట్టారు. ముమ్మారు తలాక్​ ద్వారా ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లపై మాట్లాడారు.

"మన మహిళలు ఆధునికత వైపు దూసుకెళ్తున్నారు. చంద్రయాన్‌ ప్రయోగంలో పాలుపంచుకుంటున్నారు. మహిళలను రోడ్డుపాలు చేయడం ఎంతవరకు సమంజసం?" - రవిశంకర్​ ప్రసాద్​, న్యాయశాఖ మంత్రి

11:46 July 30

పెద్దల సభలో గట్టెక్కేనా?

భాజపా నేతృత్వంలోని ఎన్​డీఏ ప్రభుత్వానికి లోక్​సభలో పూర్తి స్థాయి మెజారిటీ ఉంది. దిగువ సభలో బిల్లుకు సునాయాసంగా ఆమోదం లభించింది. అయితే..ఎగువ సభలో సరిపడ సంఖ్యా బలం లేదు. బిల్లును విపక్షాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో రాజ్యసభలో ఆమోదం లభించటం అంత సులువు కాదన్నది విశ్లేషకుల మాట. తలాక్​ బిల్లు 16వ లోక్​సభలోనే ఆమోదం పొందినప్పటికీ... రాజ్యసభలో మోక్షం లభించని విషయం తెలిసిందే.

11:26 July 30

రాజ్యసభ ముందుకు...

ముస్లిం మహిళల రక్షణ కోసం రూపొందించిన  ముమ్మారు తలాక్​ బిల్లు కాసేపట్లో రాజ్యసభలో నేడు చర్చకు రానుంది. బిల్లును ఆమోదింపజేయాలని బలమైన లక్ష్యంతో ఉంది కేంద్రం. ఈ మేరకు పార్టీ ఎంపీలకు విప్​ జారీ చేసింది భాజపా. మంగళవారం తప్పనిసరిగా పార్టీ ఎంపీలందరూ సభకు హాజరుకావాలని ఆదేశించింది.

ఇటీవలే తలాక్​ బిల్లుకు మూజువాణి ఓటుతో లోక్​సభలో ఆమోదం లభించింది. బిల్లుపై దిగువ సభలో చర్చ సందర్భంగా కాంగ్రెస్​, సమాజ్​వాదీ పార్టీ, తృణమూల్​ కాంగ్రెస్​, డీఎమ్​కే పార్టీలు సభ నుంచి వాకౌట్​ చేశాయి.

ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి అధికారం చేపట్టిన అనంతరం పార్లమెంటు​ తొలి సెషన్​లో లోక్​సభ ముందుకు తీసుకువచ్చిన మొదటి బిల్లు ఇదే. కాంగ్రెస్​, తృణమూల్​ కాంగ్రెస్​, డీఎం​కే వంటి పార్టీలు బిల్లును పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపాలని దిగువ సభలో డిమాండ్​ చేశాయి. ఇందుకు సమాధానంగా లింగసమానత్వం, సామాజిక న్యాయం జరిగేలా బిల్లును రూపొందించినట్లు ప్రభుత్వం పేర్కొంది.

Last Updated : Jul 30, 2019, 6:51 PM IST

ABOUT THE AUTHOR

...view details