భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ అయిన 'కొవాగ్జిన్' మూడో దశ ప్రయోగాలు ఈనెల 20న హరియాణాలో ప్రారంభం కానున్నాయి. ప్రయోగాల కోసం తొలి వలంటీర్‌గా పేరు నమోదు చేయించుకునేందుకు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ ముందుకొచ్చారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
కొవాగ్జిన్ తుది పరీక్షలకు తొలి వలంటీర్‌గా ఆరోగ్య మంత్రి - haryana minsiter
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవిడ్ టీకా.. కొవాగ్జిన్ తుది ప్రయోగాల కోసం తొలి వలంటీర్‌గా పేరు నమోదు చేసుకునేందుకు ముందుకొచ్చారు హరియాణా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్. ట్విట్టర్ ద్వారా ఆయన వెల్లడించారు.
అనిల్ విజ్
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కొవాగ్జిన్ మూడో దశ ప్రయోగాలు ప్రారంభమయ్యాయి.
ఇదీ చూడండి: మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు కొవాగ్జిన్