తెలంగాణ

telangana

By

Published : May 9, 2020, 3:38 PM IST

Updated : May 9, 2020, 3:45 PM IST

ETV Bharat / bharat

కశ్మీర్​లో కల్లోలానికి నాడు లష్కరే- నేడు ​టీఆర్ఎఫ్​?

​టీఆర్ఎఫ్​.. ప్రస్తుతం కశ్మీర్​లో భారత జవాన్లపై దాడులకు తెగిస్తూ.. కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఉగ్ర సంస్థ. లష్కరే తొయిబా అండదండలతో కార్యకలాపాలు సాగిస్తోన్న ముష్కర ముఠా. ఇంతవరకూ ఎవరి దృష్టిలో పడని ఈ టీఆర్​ఎఫ్​ ఎలా పుట్టింది? దీని వెనకున్నది ఎవరు? అన్న అంశాలను ఈటీవీ భారత్​తో పంచుకున్నారు రక్షణ రంగ విశ్లేషకులు, రీసెర్చ్​ అండ్​ అనాలసిస్​ విభాగం(రా) మాజీ సీనియర్​ అధికారి జేకే వర్మ, కశ్మీర్​ ఇన్​స్పెక్టర్​ జనరల్​ ఆఫ్​ పోలీసు విజయ్​ కుమార్.

TRF: An offshoot of LeT or Kashmir's homebred resistance?
కశ్మీర్​లో కల్లోలానికి నాడు లష్కరే తొయిబా.. నేడు ​టీఆర్ఎఫ్​?

హిమగిరులు, నదుల పరవళ్లు, అంతకు మించిన ప్రకృతి సోయగాలు సొంతమైన 'జమ్ముకశ్మీర్'​ ఈ భూమండలానికే ఓ ప్రత్యేకం. అందుకే కశ్మీర్​ను 'భూలోక స్వర్గం'గా అభివర్ణిస్తారు. ఇంతటి సుందర ప్రదేశం గత కొన్నేళ్లుగా గ్రెనేడ్​ దాడులు, తుపాకుల శబ్ధంతో మార్మోగుతోంది. పాకిస్థాన్​ ఆధారిత జైషే మహ్మద్​, లష్కరే తొయిబా, హిజ్​బుల్​ ముజాహిద్దీన్ వంటి తీవ్రవాద సంస్థలే ఇందుకు ప్రధాన కారణం. కశ్మీర్​ లోయలో కల్లోలం సృష్టించేందుకు అలుపెరుగని ప్రయత్నాలు చేస్తున్న ఈ ముష్కర ముఠాలు.. భారత సైనిక చర్యలతో భంగపాటుకు గురవుతున్నాయి.

అందుకే ఈసారి 'పక్కా లోకల్' స్కెచ్​తో​ గతేడాది డిసెంబరులో మరో ఎత్తుగడకు తెరలేపారు ముష్కరులు. లష్కరే తొయిబా అండతో 'ద రెసిస్టెన్స్​ ఫ్రంట్​(టీఆర్​ఎఫ్​)' అనే పేరున కొత్త ఉగ్రసంస్థను నెలకొల్పారు. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారంతో స్థానిక యువతకు ఎర వేస్తున్నారు. గతంలో జరిగిన కేరన్​​ ఎన్​కౌంటర్​ నుంచి ఇటీవలి హంద్వారా వరకు ప్రతిదీ తామే చేశామని ప్రకటించుకుంది టీఆర్​ఎఫ్. ప్రస్తుతం ఈ ఉగ్రసంస్థ వల్లే కశ్మీర్​ లోయలోని మన సైనికులు కంటిమీద కునుకు లేకుండా గస్తీ కాయాల్సి వస్తోంది.

కశ్మీర్​లో భారత భద్రతా దళాలే లక్ష్యంగా తుపాకులకు పనిచెబుతున్న ఈ ఉగ్ర సంస్థకు సంబంధించి మరిన్ని అంశాలను ఫోన్​ ద్వారా ఈటీవీ భారత్​తో పంచుకున్నారు రక్షణ రంగ విశ్లేషకులు, రీసెర్చ్​ అండ్​ అనాలసిస్​ విభాగం(రా) మాజీ సీనియర్​ అధికారి జేకే వర్మ, కశ్మీర్​ ఇన్​స్పెక్టర్​ జనరల్​ ఆఫ్​ పోలీసు విజయ్​ కుమార్. టీఆర్​ఎఫ్​ను కచ్చితంగా పాకిస్థానే స్థాపించిందని వెల్లడించారు.

" లష్కరే తొయిబా కీలక సభ్యులైన సజాత్​ జత్​ (దక్షిణ కశ్మీర్​), ఖలీద్​ (సెంట్రల్​ కశ్మీర్​), హంజాలా ఆద్​నాన్(ఉత్తర కశ్మీర్​)​ల సాయంతో టీఆర్​ఎఫ్​ను కచ్చితంగా పాకిస్థానే నడిపిస్తోంది. భారత్​పై వారి అజెండాలకు టీఆర్​ఎఫ్​ సాయంతో స్వదేశీ రంగు అద్దాలనుకుంటోంది. అంతర్జాతీయ సంస్థలు, ముఖ్యంగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్​ఏటీఎఫ్​) నుంచి వస్తున్న ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఈ విధంగా చేస్తోంది. టీఆర్​ఎఫ్ పేరు కూడా పాక్​ మనోభావాలకు అద్దం పడుతోంది.

కశ్మీర్​లో గ్రెనేడ్​ దాడి దగ్గర్నుంచి కాల్పుల వరకు ఏం జరిగినా తామే చేశామని బాధ్యత వహించేందుకు ముందుకొస్తోంది టీఆర్​ఎఫ్​. స్థానికులను ఆకర్షించేందుకు, వారి నుంచి తమకు మద్దతు కూడగట్టుకునేందుకు ఇలా చేస్తూ ఉండొచ్చు. ఇటీవల హంద్వారాలో జరిగిన ఎన్​కౌంటర్​ తర్వాత కూడా.. పాకిస్థాన్​లోని టీఆర్​ఎఫ్​ నాయకులు ట్విట్టర్​ వేదికగా ఏ విధంగా బాధ్యత వహించారో మనమందరం చూశాం. గతంలోనూ కేరన్ సెక్టార్​లో ​జరిగిన ఎన్​కౌంటర్​కూ ఇలాగే బాధ్యత వహించారు."

- జేకే వర్మ, రక్షణ విశ్లేషకులు, రీసెర్చ్​ అండ్​ అనాలసిస్​ విభాగం(రా) మాజీ సీనియర్​ అధికారి

'టీఆర్​ఎఫ్​తో స్వదేశీ ఉద్యమ రంగు'

కశ్మీర్​ ఇన్​స్పెక్టర్​ జనరల్​ ఆఫ్​ పోలీసు విజయ్​ కుమార్​ కూడా ఈటీవీ భారత్​తో మాట్లాడారు. టీఆర్​ఎఫ్​ కీలక నాయకులందరూ లష్కరే తొయిబాకు చెందినవారేనని వెల్లడించారు.

" ఓ కొత్త పేరుతో టీఆర్​ఎఫ్​ను లష్కరే తొయిబానే గతేడాది స్థాపించింది. ఈ ఉగ్రవాదులందరూ మా రికార్డుల్లో ఉన్నవారే. హంద్వారా ఎన్​కౌంటర్​లో మరణించిన ఇద్దరు ముష్కరుల్లో ఒకడు లష్కరే కమాండర్​ హైదర్​. హిజ్​బుల్​ ముజాహిద్దీన్ తీవ్రవాదులను కూడా కలుపుకుని టీఆర్​ఎఫ్​ మరింత విస్తరించాలని చూస్తోంది.​ కశ్మీరీలు​ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారని ప్రపంచాన్ని నమ్మించాలని చూస్తోంది. వాస్తవానికి అది జరగదు. ఎందుకంటే నిజమేంటో.. అందరికీ తెలుసు.

పోలీసులు టీఆర్​ఎఫ్​ టెలీగ్రామ్​ ఖాతాను బ్లాక్​ చేశారు. అందుకే రియాజ్​ నైకూ మరణవార్తకు సంబంధించి తక్కువ అప్​డేట్స్​ మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం భద్రతా బలగాలపై గ్రెనేడ్​ దాడి చేసేందుకు టీఆర్​ఎఫ్​ ప్రణాళికలు రచిస్తోంది."

- విజయ్​ కుమార్, కశ్మీర్​ ఇన్​స్పెక్టర్​ జనరల్​ ఆఫ్​ పోలీసు

గతేడాది డిసెంబరులో...

గతేడాది ఆగస్టు 5న ఆర్టికల్​ 370, 35ఏను కేంద్రం రద్దు చేసింది. ఆ తర్వాత నాలుగు నెలలకు డిసెంబరులో ఈ టీఆర్​ఎఫ్​ ఉగ్రసంస్థ పుట్టుకొచ్చింది. లష్కరే తొయిబా మాజీ నాయకుడు ఈ సంస్థను నడిపిస్తున్నాడని సైనిక నిఘా వర్గాలు చెబుతున్నాయి. టీఆర్​ఎఫ్​ మాత్రం లష్కరే తొయిబాతో తమకు ఎలాంటి సంబంధం లేదని బుకాయిస్తోంది.

ఇదీ చదవండి : శ్మీర్​పై పాక్​ కొత్త కుట్రలు- తాలిబన్ల సాయంతో...

Last Updated : May 9, 2020, 3:45 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details