తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శాసన​సభ బరిలో ట్రాన్స్​జెండర్​ - transgender

ఒడిశా శాసనసభ ఎన్నికల్లో కాజల్​ నాయక్​ అనే ట్రాన్స్​జెండర్​ బీఎస్పీ తరఫున పోటీ చేయనున్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది తొలిసారి. బీఎస్పీ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ పార్టీలను ఆశ్చర్యానికి గురిచేసింది.

ఎన్నికల బరిలో ట్రాన్స్​జెండర్

By

Published : Mar 17, 2019, 6:36 PM IST

ఎన్నికల బరిలో ట్రాన్స్​జెండర్
ఒడిశాలో రానున్న శాసనసభ ఎన్నికల నేపథ్యంలో బహుజన్​ సమాజ్​ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఓ ట్రాన్స్​జెండర్​ను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపనుంది. జైపూర్​ జిల్లాలోని కోరై అసెంబ్లీ స్థానం నుంచి 'కాజల్​ నాయక్'​ పోటీ చేయనున్నారని ప్రకటించింది.

ఎన్నికలకు సిద్ధమవుతున్న కాజల్​ నాయక్​... ప్రస్తుతం జైపూర్​ ట్రాన్స్​జెండర్ల సమాఖ్యకు అధ్యక్షత వహిస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నానని, ప్రజా సంక్షేమానికి తానెంతో ప్రాధాన్యమిస్తానని చెప్పారు కాజల్​ నాయక్​.

" మాకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించిన బీఎస్పీ అధినేత్రి మాయావతికి ధన్యవాదాలు. దీనికి సహకరించిన రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు. మేము ట్రాన్స్​జెండర్స్​​ అయినప్పటికీ సమాజంలో అందరితో సమానంగా సీటు కేటాయించారు. ఎన్నో రోజుల నుంచి నేను సమాజసేవ చేస్తున్నాను. ప్రజలతోనే ఉన్నాను. వారు మమ్మల్ని ఆదరిస్తారనే నమ్మకముంది. మేమూ మార్పు కోరుకుంటున్నాం."
-కాజల్ నాయక్ , బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి

ఇదీ చూడండి :'ప్రజాసేవకు నేనెందుకు పనికిరాను?'

ABOUT THE AUTHOR

...view details