తమిళనాడు రాజధాని చెన్నైలో నీటి ఎద్దడిని తగ్గించేందుకు అక్కడి ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగిస్తోంది. ఇప్పటికే సముద్రపు నీటిని మంచి నీరుగా మార్చే ప్లాంటులను ఏర్పాటు చేసింది. తాజాగా రైలు ద్వారా నీటిని సరఫరా చేస్తోంది.
వెల్లూరు జిల్లా జోలార్‌పేట రైల్వే స్టేషన్ నుంచి చెన్నైకు తొలి రైలు ట్యాంకర్ పంపింది రాష్ట్ర ప్రభుత్వం. అధికారులు పూజలు నిర్వహించి జెండా ఊపిన తర్వాత ట్యాంకర్ బయలుదేరింది.