వాఘా-అత్తారీల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను శాశ్వతంగా నిలిపివేసింది పాకిస్థాన్.
లాహోర్ నుంచి ఇప్పటికే టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బులు తిరిగి చెల్లిస్తామని పాకిస్థాన్ రైల్వే మంత్రి ప్రకటించారు.
భద్రతా కారణాలతో వాఘా సరిహద్దు వద్ద దిల్లీ-లాహోర్ మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేస్తున్నట్లు దాయాది దేశం ప్రకటించింది. వారంలో రెండు సార్లు నడిచే ఈ రైలును 1976లో ప్రారంభించారు.
సినిమాలపైనా..
భారతీయ సినిమాలపైనా పాకిస్థాన్ నిషేధం విధించింది. జమ్ముకశ్మీర్ విషయంలో భారత్ నిర్ణయం నేపథ్యంలో నిషేధం విధిస్తున్నట్లు పాక్ ప్రధాని ప్రత్యేక అధికారి ప్రకటించారు.
భారత్-ఆప్ఘనిస్థాన్ మధ్య వాఘా సరిహద్దు ద్వారా జరిగే వ్యాపారాన్ని కూడా అనుమతించబోమని స్పష్టం చేసింది పాక్. వాణిజ్యాన్ని రద్దు చేయాలని ఆప్ఘనిస్థాన్‌కు సూచించగా.. ఆ దేశం కూడా అంగీకరించిందని పాక్ ప్రధాని వాణిజ్య సలహాదారు అబ్దుల్ రజాక్ దావూద్ తెలిపారు.
ఇదీ చూడండి: దుమారం రేపిన డోభాల్‌పై ఆజాద్ వ్యాఖ్యలు..!