ఉత్తరాదిని మంచు దుప్పటి కప్పేసింది. జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో భారీగా హిమపాతం నమోదైంది. ఇళ్లు, కార్యాలయాలు, చెట్లు ధవళ వర్ణాన్ని సంతరించుకున్నాయి. పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జనజీవనం స్తంభించింది.
జమ్ము కశ్మీర్
జమ్ముకశ్మీర్లో విపరీతంగా కురుస్తోన్న మంచు వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్థానికులు అక్కడి ప్రథమ పండగలైన లోహ్రీ, మకర సంక్రాంతిని ఆనందంతో జరుపుకునే అవకాశం లేకపోయింది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
స్తంభించిన రవాణా..
విపరీతంగా కురుస్తోన్న మంచు కారణంగా... రాంబన్ జిల్లాలో మంచు చరియలు విరిగిపడి శ్రీనగర్ నుంచి జమ్మూ వెళ్లే రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మాతా వైష్ణో దేవి ఆలయం వైపు ప్రయాణించే పలు విమానసర్వీసులు రద్దయ్యాయి.